Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#KGFChapter2 సంజయ్ దత్ ఫస్ట్ లుక్ వచ్చేసింది..

Advertiesment
#KGFChapter2 సంజయ్ దత్ ఫస్ట్ లుక్ వచ్చేసింది..
, సోమవారం, 29 జులై 2019 (12:50 IST)
కన్నడ క్రేజ్ హీరో యష్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ సినిమా రికార్డుల పంట పండించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. 'కేజీఎఫ్‌ చాప్టర్‌ 2' భారీ క్యాస్టింగ్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.


హోంబళే ఫిలింస్‌, వారాహి చలన చిత్ర సంస్థలు సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న 'కేజీఎఫ్‌ చాప్టర్‌ 2'కు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ టాప్ హీరోలు నటిస్తున్నారు. ఫలితంగా ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. 
 
కేజీఎఫ్‌లో మెయిన్ విలన్ బ్రదర్ పాత్రలో అధీరా అనే పాత్రను చూపించినా క్యారెక్టర్ చేసిన నటుడెవరో రివీల్ చేయలేదు. 'కేజీఎఫ్‌ చాప్టర్‌ 2'లో అధీరాదే కీలక పాత్ర అని సమాచారం. ఆ పాత్రను బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పోషిస్తున్నారు. 
 
జూలై 29వ తేదీన సంజయ్ దత్ పుట్టిన రోజు కావడంతో ఆ సినిమాలోని ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. తలపాగా చుట్టుకుని కళ్లు మాత్రమే కనిపించేలా తీర్చిదిద్దిన ఈ లుక్‌ విడుదలైన వెంటనే వైరల్‌గా మారింది. 
 
ఇకపోతే.. కేజీఎఫ్ అక్రమ మైనింగ్‌ నేపథ్యంలో తెర‌కెక్కిన చిత్రం‌. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం క‌న్న‌డ‌లోనే కాక తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో మంచి విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి కొన‌సాగింపుగా భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా కేజీఎఫ్ చాప్టర్ 2ను తెర‌కెక్కిస్తున్నారు. 2020లో ఈ చిత్రం విడుదల కానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ తెలుగు: హౌజ్‌ నుంచి హేమ అవుట్.. ట్రాన్స్‌జెండర్ తమన్నా ఇన్