Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్.. ఎంతవ‌ర‌కు వ‌చ్చింది..?

Advertiesment
కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్.. ఎంతవ‌ర‌కు వ‌చ్చింది..?
, మంగళవారం, 14 మే 2019 (20:01 IST)
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన `కేజీఎఫ్ చాప్టర్- 1` సంచలనాల గురించి తెలిసిందే. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత‌ వసూళ్లు సాధించింది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. కన్నడ, హిందీ, తెలుగు, త‌మిళంలో చక్కని వసూళ్లతో ఆకట్టుకుంది. 
 
ప్రస్తుతం ఈ ఫ్రాంఛైజీలో సీక్వెల్ సినిమా కేజీఎఫ్ ఛాప్టర్ 2 ఆన్ సెట్స్ ఉన్న సంగతి తెలిసిందే. 
ఈ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది. తాజాగా షెడ్యూల్స్ వివ‌రాల్ని చిత్ర‌యూనిట్ తెలియ‌జేసింది. ప్ర‌స్తుతం బెంగ‌ళూరులో షూటింగ్ చేస్తున్నారు. త‌ర్వాత మైసూర్‌లో షూటింగ్ చేస్తారు. అటుపై రామోజీ ఫిలింసిటీ షెడ్యూల్ ఉంటుంది. 
 
చివరిగా కర్నాటక- బళ్లారిలో షెడ్యూల్‌తో మెజారిటీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది. దాదాపు 80-90 శాతం అప్ప‌టికి పూర్త‌వుతుంది అని కేజీఎఫ్ టీమ్ అధికారికంగా ప్ర‌క‌టించింది. చాప్ట‌ర్ 2లో బాలీవుడ్ పలువురు క్రేజీ బాలీవుడ్ స్టార్లు కీల‌క పాత్ర‌లు పోషించనున్నారు. ఈ సీక్వెల్‌లో తొలి భాగాన్ని మించి భారీ యాక్ష‌న్‌ని చూపించ‌నున్నామ‌ని ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్.. య‌శ్‌ ఇదివ‌ర‌కూ వెళ్ల‌డించారు. 
 
కేజీఎఫ్ అంటే కోలార్ బంగారు గ‌నులు (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) అని అర్థం. ద‌శాబ్ధాల క్రితం కోలార్ బంగారు గ‌నుల్లో మాఫియా క‌థతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. కేజీఎఫ్ గ‌నుల‌పై ప్ర‌పంచ మాఫియా క‌న్ను ఎలా ఉండేది అన్న‌దానిని తొలి భాగంలోనే అద్భుతంగా రివీల్ చేశారు. పార్ట్ 2లో ఇంకా భీక‌ర పోరాటాల్ని తెర‌పై చూపించనున్నారు. మాఫియాని పీక్స్‌లో చూపించ‌బోతున్నార‌ని హోంబ‌లే సంస్థ తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరు ఫ్యామిలీకి షాక్ ఇచ్చిన మెగా ఫ్యాన్... రంగంలోకి దిగిన చిరు టీమ్..!