Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే వేదికపై ట్రిపుల్ ఆర్ కాంబినేషన్ ... ఫోటో వైరల్

Webdunia
ఆదివారం, 9 డిశెంబరు 2018 (12:02 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఇటీవ‌ల తొలి షెడ్యూల్ పూర్తి చేసుకోగా, జ‌న‌వ‌రి నుండి మ‌రో షెడ్యూల్ జ‌రుపుకోనుంది. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. 
 
2020లో ఈ మూవీ విడుద‌ల కానుంది. అయితే ఈ రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ అంటే అభిమానుల‌లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. గ‌తంలో వీరు ముగ్గురు క‌లిసి దిగిన ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో ఫుల్ వైర‌ల్ అయింది.
 
పైగా, ఈ ముగ్గురు ఒకే వేదికను పంచుకోనున్నారు. ఈ వార్త ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి రేకిత్తిస్తోంది. అతి త్వ‌ర‌లో చెర్రీ న‌టించిన "వినయ విధేయ రామ" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించాలని దర్శకనిర్మాతలు నిర్ణయించారట. 
 
అయితే ఈ ఈవెంట్‌కు రాజమౌళి, ఎన్టీఆర్‌ని ఆహ్వానించాలని చిత్ర బృందం భావించిన‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్ర నిర్మాత దానయ్యనే 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని కూడా నిర్మస్తుండడంతో ఎన్టీఆర్, రాజమౌళి ఈ ఈవెంట్లో పాల్గొన‌డం ప‌క్కా అని అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

ఊరెళ్లిన భర్త... గొంతుకోసిన స్థితిలో కుమార్తె... ఉరికి వేలాడుతూ భార్య...

ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె.. పరువు పోయిందని తండ్రి ఆత్మహత్య

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments