Webdunia - Bharat's app for daily news and videos

Install App

విన్ డీజిల్ నాతో ప్రేమలో పడ్డాడు.. ఆయనో అద్భుతమైన వ్యక్తి: దీపికా పదుకొనే

బాలీవుడ్ నటి దీపికా పదుకునే హాలీవుడ్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. హాలీవుడ్‌లో ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్ సినిమాతో దీపికా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో హాలీవుడ్ హీరో విన్ డీజిల్‌తో రొమాం

Webdunia
సోమవారం, 22 మే 2017 (18:47 IST)
బాలీవుడ్ నటి దీపికా పదుకునే హాలీవుడ్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. హాలీవుడ్‌లో ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్ సినిమాతో దీపికా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో హాలీవుడ్ హీరో విన్ డీజిల్‌తో రొమాంటిక్ సీన్స్ పండించింది. అంతేగాకుండా అందాల ఆరబోతలో ఏమాత్రం హద్దులు పాటించలేదు. దీపికాతో రొమాన్స్ వెనుక విన్ డీజిల్ రియల్ లవ్ స్టోరీ ఉందనే విషయం తాజాగా లీకైంది. అది కూడా దీపికా పదుకునేనే ఓపెన్ చెప్పేసింది. 
 
బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్‌తో లవ్‌లో ఉన్నట్లు బిటౌన్‌లో వార్తలొస్తున్న నేపథ్యంలో.. విన్ డీజిల్‌ తనతో ప్రేమలో పడ్డాడని దీపికా పదుకునే వెల్లడించింది. తాను కలిసిన వ్యక్తుల్లో ఆయనో అద్భుతమైన వ్యక్తి అని దీపికా కొనియాడింది. విన్ డీజిల్‌తో చేసిన సినిమా తనకు ఎన్నో అద్భుతమైన అనుభూతులను ఇచ్చిందని కేన్స్ ఉత్సవాలకు హాజరైన సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపికా పదుకొనే వెల్లడించింది.
 
విన్ డీజిల్‌ను తాను ఓ మంచి స్నేహితుడిగా భావిస్తున్నానని చెప్పుకొచ్చింది. ఇక తన 70 ఏళ్ల వయస్సులో మనువరాళ్లు, మనవళ్లతో చిన్నపాటి ఇంట్లో సంతోషంగా గడిపేయాలని దీపికా తెలిపింది. ప్రస్తుతం దీపికా పదుకొనే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో పద్మావతి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలుకు - ఫ్లాట్‌ఫామ్ ‌మధ్య పడిన యువతి.. మెరుపువేగంతో స్పందించిన కానిస్టేబుల్... (వీడియో)

Hyderabad: భర్తతో గొడవ- అపార్ట్‌మెంట్‌లో 30 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

కర్నూలులో దారుణం.. కాలు నరికి అందరికీ చూపించాడు...

15 రోజుల పసికందును లోకల్ రైలులో వదిలి పారిపోయిన మహిళ.. తర్వాత ఏం జరిగింది?

మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్.. నిందితుల్లో డీన్స్ కుమారుడు? 25 మందిపై సస్పెన్షన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments