Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి కోసం అమ్మకు విడాకులివ్వడం సహించలేకపోతున్నా.. వాళ్లతో సంబంధాలు అంతంత మాత్రమే

బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ శ్రీదేవిని పెళ్లాడటం కోసం తన తల్లికి విడాకులు ఇవ్వడాన్ని.. యంగ్ హీరో అర్జున్ కపూర్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాడు. తన తండ్రి అమ్మకు అన్యాయం చేసి శ్రీదేవిని రెండో పెళ్లి చే

Webdunia
సోమవారం, 22 మే 2017 (17:45 IST)
బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ శ్రీదేవిని పెళ్లాడటం కోసం తన తల్లికి విడాకులు ఇవ్వడాన్ని.. యంగ్ హీరో అర్జున్ కపూర్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాడు. తన తండ్రి అమ్మకు అన్యాయం చేసి శ్రీదేవిని రెండో పెళ్లి చేసుకోవడంపై అర్జున్ కపూర్ ఏమన్నాడంటే.. తన లైఫ్‌లో అదే క్రిటికల్ టైమంటూ వ్యాఖ్యానించాడు. శ్రీదేవి అర్జున్ కపూర్‌కు ఎంత దగ్గరవ్వాలనుకున్నా.. అతడు మాత్రం శ్రీదేవి అంటేనూ.. ఆమె పిల్లలంటేనూ పక్కకు వెళ్లిపోతున్నాడు. 
 
కాగా, ఐదు పదుల వయస్సులో కూడా గ్లామర్ విషయంలో కూతుళ్లతో పోటీపడుతున్న శ్రీదేవి.. ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా తర్వాత మామ్ మూవీతో తెరపై కనిపించనుంది. శ్రీదేవి భర్త బోనీకపూర్ ఈ సినిమాకు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో బోనీ కపూర్ తొలి భార్య కుమారుడు అర్జున్ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు. అర్జున్ కపూర్ లేటెస్ట్ మూవీ 'హాఫ్ గర్ల్‌ఫ్రెండ్' రీసెంట్‌గా రిలీజ్ అయింది. అయితే..అర్జున్ కపూర్‌కి తన పిన్ని శ్రీదేవితో మంచి సంబంధాలు లేవని క్లారిటీ ఇచ్చేశాడు. శ్రీదేవిని పెళ్ళి చేసుకోవడానికి బోనీ కపూర్ తన తల్లికి విడాకులివ్వడాన్ని ఏమాత్రం సహించుకోలేకపోతున్నానని అర్జున్ కపూర్ అన్నాడు. అందుకే శ్రీదేవికి, ఆమె కూతుళ్లకు తాను దూరంగా ఉంటున్నానని అర్జున్ కపూర్ తెలిపాడు. 
 
తన తండ్రి రెండో వివాహం చేసుకోవడం ద్వారా తాను తన సోదరి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు అర్జున్ కపూర్ తెలిపాడు. 2012లో మోనా కపూర్ (అర్జున్ కపూర్ తల్లి) మరణించాక..చాలా కష్టాలు పడ్డామని అర్జున్ చెప్పుకొచ్చాడు. ఎవరికీ తాను వ్యతిరేకం కాదని.. శ్రీదేవి తన తండ్రికి రెండో భార్య మాత్రమేనని, ఆమెతోనూ ఆమె పిల్లలతోనూ తమకు సంబంధాలు లేవన్నాడు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments