Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి' రికార్డును బ్రేక్ చేసిన 'విక్రమ్'.. అదీ కూడా 15 రోజుల్లోనే..

Webdunia
ఆదివారం, 19 జూన్ 2022 (11:18 IST)
విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం "విక్రమ్". ఇది ఐదేళ్ల క్రితం ప్రభాస్ నటించిన "బాహుబలి-2" చిత్ర రికార్డును బ్రేక్ చేసింది. అదీకూడా కేవలం 15 రోజుల్లోనే బద్ధలుకొట్టింది. ఫలితంగా తమిళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా, తమిళంలో రూ.150 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి తమిళ సినిమాగా సరికొత్త రికార్డును సృష్టించింది. 
 
జూన్ 3వ తేదీన ఈ చిత్రం విడుదలైంది. ఆ తర్వాత పోటీగా పలు చిత్రాలు వచ్చినప్పటికీ 'విక్రమ్' దూకుడును అడ్డుకోలేకపోయాయి. ఫలితంగా ఇప్పటికీ అనేక థియేటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శిస్తున్నారు. అదేవిధంగా తెలుగులో కూడా హీరో నితిన్ హోం బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ సంస్థ విడుదల చేసింది. 'విక్రమ్‌'కు రూ.7.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా, 15 రోజుల్లో ఈ చిత్రం రూ.14.71 కోట్ల షేర్‌ను సాధించి బ్లాక్‌బస్టర్‌హిట్‌గా నిలిచింది. 
 
కమల్ హాసన్ నాలుగేళ్ళ విరామం తర్వాత నటించిన ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించగా, హీరో సూర్య రోలెక్స్ పాత్రలో చివరి 5 నిమిషాల్లో మెరిశాడు. సూర్య పాత్ర ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చగా, రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments