Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ సేతుపతి పిజ్జా 2 వ‌చ్చేస్తుంది...

Webdunia
శుక్రవారం, 22 నవంబరు 2019 (16:43 IST)
విజయ్ సేతుపతి, గాయత్రి హీరోహీరోయిన్లుగా తమిళంలో తెరకెక్కిన చిత్రం 'పురియత్ పుధీర్'. తమిళంలో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని 'పిజ్జా-2' పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. గతంలో విజయ్ సేతుపతి నటించించిన 'పిజ్జా' చిత్రం తెలుగులో మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు తెలుగులో 'పిజ్జా 2' గా టైటిల్ ఖరారు చేశారు. 
 
డి.వి.సినీ క్రియేష‌న్స్ మరియు లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్ బ్యాన‌ర్‌పై  ఉదయ్ హర్ష వడ్డేల్ల,  డి.వి.వెంక‌టేష్, సంయుక్తంగా డిసెంబర్ మొదటి వారంలో ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కులకు అందిస్తున్నారు.
 
 ఆధునిక టెక్నాలజీ పేరుతో కొందరు యువకులు అమాయక మహిళలను ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారో తెలిపే ఒక సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసుకుని థ్రిల్లర్ జోనర్‌లో ఈ సినిమా రూపొందించబడింది. 
 
ఆద్యంతం ఉత్కంఠతో నడుస్తూ ఆసక్తిని కలిగించే స్క్రీన్‌ప్లేతో సాగే ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ని దర్శకుడు రంజిత్ జయకోడి తెరకెక్కించారు. ఈ చిత్రంలో నేరం ఫేమ్ రమేష్ తిలక్, సోనియా దీప్తి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీకేను సీఎం చేయాలంటూ మతపెద్ద సలహా... కామెంట్స్ చేయొద్దన్న డీకే

ఏదిపడితే అది మాట్లాడకుండా నా నోటికి చంద్రబాబు ప్లాస్టర్ వేశారు : అయ్యన్నపాత్రుడు

రామథ్ కుంగిపోయింది.. అయోధ్యలో భక్తుల ఇక్కట్లు అన్నీఇన్నీకావు రామయ్య!!

టీమిండియా విజయపరంపర కొనసాగాలని ఆకాంక్ష : ప్రధాని మోడీ

సరికొత్త చరిత్రను సృష్టించిన టీమిండియా : బాబు - పవన్ శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments