Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాంబు పేల్చిన బిగ్ బాస్... గాయత్రి గుప్తాకి ఆ జబ్బు వుంది... (video)

Advertiesment
బాంబు పేల్చిన బిగ్ బాస్... గాయత్రి గుప్తాకి ఆ జబ్బు వుంది... (video)
, బుధవారం, 17 జులై 2019 (14:21 IST)
గాయత్రి గుప్తా, శ్వేతా రెడ్డి... ఇపుడీ ఈ పేర్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్‌గా మారాయి. వైరెల్ ఎందుకయ్యాయో వేరే చెప్పక్కర్లేదు. బిగ్ బాస్ నిర్వాహకులు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారనీ, అసభ్యమైన ప్రశ్నలు అడిగారంటూ వారు కేసులు పెట్టారు. ఇకపోతే గాయత్రి గుప్తా పోలీసులకిచ్చిన ఫిర్యాదులో... సెక్స్ లేకుండా వంద రోజులు బిగ్ బాస్ హౌస్‌లో ఉండగలవా..? అంటూ అడిగారని పేర్కొంది.
 
ఇలాంటి అసభ్యమైన ప్రశ్నలు వేసి తమను మనోవేదనకు గురయ్యేలా చేసినట్లు తెలిపారు. తనను బిగ్ బాస్ 3 షో నుంచి ఎందుకు రిజెక్ట్ చేశారన్నదానిపై క్లారిటీ ఇచ్చింది. బిగ్ బాస్ నిర్వాహకులు తనతో మీకేమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా? అని అడిగినప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉందన్నాననీ, ఆ వ్యాధి కారణంగా బరువులు ఎత్తలేనని చెప్పాననీ, కనీసం పది రోజులకోసారి ఫిజియోథెరపీ అవసరం వుండొచ్చని చెప్పినట్లు వెల్లడించింది. 
 
తన మాటలన్నీ విన్న తర్వాత కూడా తనను బిగ్ బాస్ 3కి సెలక్ట్ చేసుకున్నారనీ, ఐతే అకస్మాత్తుగా నాకు ఓ రోజు ఫోన్ చేసి మీరు బిగ్ బాస్ 3కి సెలెక్ట్ కాలేదనీ, మీకున్న జబ్బు కారణంగా ఆ అవకాశం పోయిందని తనతో చెప్పినట్లు వెల్లడించింది గుప్తా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ఫీజుల పెంపునకు చెక్... చట్టసవరణ దిశగా సీఎం అడుగులు