Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 24 April 2025
webdunia

'స‌రిలేరు నీకెవ్వ‌రు' గురించి అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన విజ‌య‌శాంతి... ఏంటది?

Advertiesment
Vijayasanti
, సోమవారం, 24 జూన్ 2019 (13:54 IST)
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఆకట్టుకునే విలక్షణమైన నటనతో లేడీ అమితాబ్‌గా పేరుగాంచిన నటి విజయశాంతి. ఇటీవల సినిమాలకు స్వస్తి పలికి రాజకీయాలకు మాత్రమే పరిమితమైన ఆమె, త్వరలో సూపర్ స్టార్ మహేష్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో ప్రారంభం కానున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్నారు. 
 
2006లో ఆమె నటించిన నాయుడమ్మ సినిమా ఆమెకు చివరి సినిమా. అయితే ఇన్నేళ్ల గ్యాప్ తరువాత మళ్ళి సినిమాల్లోకి పునఃప్రవేశం చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఎప్పటినుండో తన సినిమాలో నటించమని దర్శకులు అనిల్ రావిపూడి తనను కోరుతున్నారని అన్నారు.
 
అయితే ఇటీవల సరిలేరు నీకెవ్వరు చిత్ర కథ మరియు అందులో తన పాత్ర గురించి విన్న తరువాత, ఇది తప్పకుండా తనకు మంచి కంబ్యాక్ సినిమా అవుతుందని భావించి ఒప్పుకోవడం జరిగిందని ఆమె ఒక తెలుగు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. 
 
సినిమాలో మహేష్ బాబు పాత్రతో పాటు సమాంతరంగా తన పాత్ర ఉంటుందని ఆమె వెల్లడించారు. జులై ప్రథమార్ధంలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నుంచి సినిమాలు కంటిన్యూ చేస్తారా..? మ‌ద‌ర్‌గా, వ‌దిన‌గా న‌టిస్తారా అంటే... చేయ‌నని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. త‌నకున్న ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టుగా త‌ను చేయాల్సిన పాత్ర అయితేనే చేస్తాన‌న్నారు. అదీ సంగతి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''దొరసాని'' నుంచి #KallalloKalaVaramaiLyrical వచ్చేసింది.. (video)