Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''దొరసాని'' నుంచి #KallalloKalaVaramaiLyrical వచ్చేసింది.. (video)

Advertiesment
''దొరసాని'' నుంచి #KallalloKalaVaramaiLyrical వచ్చేసింది.. (video)
, సోమవారం, 24 జూన్ 2019 (11:16 IST)
సినీనటి జీవితా రాజశేఖర్ కుమార్తె శివాత్మిక ''దొరసాని'' సినిమా టీజర్ ఇటీవల విడుదలై.. సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ఓ లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది.


ఈ పాట ప్రస్తుతం శ్రోతల మనస్సును దోచుకుంటుంది. "కళ్లల్లో కలవరమై .. కలవరమై, గుండెల్లో పరవశమో వరమై.." అంటూ ఈ పాట సాగుతోంది. మెలోడీగా సాగే ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. 
 
ఇకపోతే.. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో 'దొరసాని' అనే ప్రేమకథ రూపొందుతోంది. శివాత్మిక .. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నాయికా నాయకులుగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే ఈ టైటిల్‌కే కాదు.. టీజర్‌కి మంచి స్పందన లభించింది. తాజాగా వచ్చేసిన కళ్లల్లో కలవరమై పాట.. సూపర్ హిట్ అయ్యింది. విడుదలైన గంటల్లోనే శ్రోతలను ఆకట్టుకుంటోంది. 
 
ఇకపోతే.. ఈ పాటకు ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం, శ్రేష్ట సాహిత్యం, చిన్మయి శ్రీపాద ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. వచ్చేనెల 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకేముంది... తాజాగా విడుదలైన లిరికల్ సాంగ్ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నడిగర్ సంఘం ఎన్నికల్లో ఓటు వేయని రజినీకాంత్