Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డియర్ కామ్రేడ్ నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ (Video)

Advertiesment
డియర్ కామ్రేడ్ నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ (Video)
, బుధవారం, 15 మే 2019 (13:28 IST)
టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం "డియర్ కామ్రేడ్". ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన  ఈచిత్రం ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్‌ సాంగ్‌ను రిలీజ్ చేశారు. 'కడలల్లె వేచె కనులే.. కదిలేను నదిలా కలలే.. ఒడి చేరి ఒకటైపోయే.. తీరం కోరే ప్రాయం..' అంటూ సాగే రొమాంటిక్‌గా ఈ పాట సాగుతోంది. ఈ పాటను ఇప్పటికే 1.40 లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. 
 
జస్టిన్ ప్రభాకరన్ సంగీతం.. రెహ్మాన్ సాహిత్యం.. సిద్ శ్రీరామ్ - ఐశ్వర్య రవిచంద్రన్ ఆలాపన యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. జస్టిన్ ప్రభాకరన్ స్వరపరిచిన బాణీ అద్భుతంగా వుంది. కాగా, "గీత గోవిందం" తర్వాత విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నాలు జంటగా నటిస్తున్న చిత్రం 'డియర్ కామ్రేడ్'.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అదేంటోగానీ అంటున్న నాని - శ్రద్ధా శ్రీనాథ్ - "జెర్సీ" సాంగ్ రిలీజ్