Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అదేంటోగానీ అంటున్న నాని - శ్రద్ధా శ్రీనాథ్ - "జెర్సీ" సాంగ్ రిలీజ్ (Video)

Advertiesment
అదేంటోగానీ అంటున్న నాని - శ్రద్ధా శ్రీనాథ్ -
, బుధవారం, 15 మే 2019 (12:01 IST)
వ‌రుస సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌కి థ్రిల్ క‌లిగించే నాని న‌టించిన తాజా చిత్రం "జెర్సీ". 'మ‌ళ్ళీ రావా' ఫేం గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 19వ తేదీన రిలీజ్ అయింది. ఈ చిత్రానికి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ల‌భించింది. సినీ ప్ర‌ముఖులు కూడా ఈ సినిమాని ఆకాశానికి ఎత్తేశారు. ముఖ్యంగా నాని క్రికెట‌ర్‌గా అద‌రగొట్టాడ‌ని చెప్పుకొచ్చారు. 
 
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో శ్ర‌ద్ధా శ్రీనాథ్ కథానాయికగా న‌టించింది. అనిరుధ్ రవిచందర్ స్వరాల్ని సమకూర్చారు. ఆయ‌న సంగీత సార‌థ్యంలో రూపొందిన ప్ర‌తి సాంగ్ సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ఈ చిత్రంలో హీరో నాని 36 యేళ్ళు వయసులో క్రికెట్‌లో తన లక్ష్యాన్ని ఎలా సాధించాడు. 
 
ఈ క్రమంలో అతని జీవితంలో ఎదురైన పరిస్థితులేమిటన్నది ఆద్యంతం ఆసక్తికరంగా చూపించారు. 1996-97 రంజీట్రోఫీ క్రికెట్ నేపథ్యంలో ఈ చిత్ర కథ నడిచింది. సత్యరాజ్, రోనిత్‌కర్మ, బ్రహ్మాజీ తదితరులు నటించిన‌ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌గా సను వర్గీస్ ప‌నిచేశారు. తాజాగా చిత్రం నుండి అదేంటో గాని ఉన్న‌పాటుగా అనే సాంగ్ వీడియోని విడుద‌ల చేశారు . ఈ పాట‌కి అనిరుధ్ సంగీతం అందించ‌డ‌మే కాకుండా ఆల‌పించ‌డం విశేషం. కృష్ణ కాంత్ లిరిక్స్ అందించారు. మీరు ఈ సాంగ్‌పై ఓ లుక్కేయండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"మహర్షి" చిత్రాన్ని తిలకించిన ఉపరాష్ట్రపతి ఫ్యామిలీ... మహేశ్ బాబుకు కితాబు