తమిళ సినిమా మెర్సల్ సినిమాలోని రెండు డైలాగుల పట్ల భాజపా వ్యతిరేకించడంతో ఆ చిత్రం ఎక్కడికో వెళ్లిపోతోంది. వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రెండో వారం కూడా మల్టీఫ్లెక్స్ థియేటర్లతో సహా రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. మరోవైపు మెర్సల్ సినిమాక
తమిళ సినిమా మెర్సల్ సినిమాలోని రెండు డైలాగుల పట్ల భాజపా వ్యతిరేకించడంతో ఆ చిత్రం ఎక్కడికో వెళ్లిపోతోంది. వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రెండో వారం కూడా మల్టీఫ్లెక్స్ థియేటర్లతో సహా రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. మరోవైపు మెర్సల్ సినిమాకు రజినీకాంత్ మద్దతు తెలిపారు. మరో నటుడు విశాల్ కూడా తన మద్దతును తెలియజేశారు. దీనికి ప్రతిగా ఆయనపై దాడులు జరుగుతున్నాయంటూ విమర్శలు వస్తున్నాయి.
ఇదిలావుంటే విశాల్ చెప్పిన దాంట్లో ఎలాంటి తప్పు లేదంటూ సీనియర్ నటి ఖుష్బూ అతడికి మద్దతుగా నిలిచింది. ఖుష్బూ మద్దతుగా నిలబడటంతో నటుడు విజయ్ అభిమానులు ఆమెను శభాష్ ఖుష్బూ... అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇలా తమిళ సినీ ఇండస్ట్రీ ఒక్కొక్కరుగా మెర్సల్ చిత్రానికి మద్దతు పలుకుతుండటంతో ఆ చిత్రం రూ. 200 కోట్ల మార్కును దాటి ముందుకు పరుగులు పెడుతోంది. కాగా తెలుగులో ఇంకా విడుదల కావాల్సి వుంది. తెలుగులో ఈ చిత్రాన్ని అదిరింది పేరుతో విడుదల చేయబోతున్నారు.
ఈ మూవీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక పథకాలను హేళన చేయడంపై బీజేపీ మండిపడుతోంది. జీఎస్టీని, డిజిటల్ ఇండియా ప్రచారాన్ని తప్పుగా చూపించారని, ఇది ప్రజల్లో తప్పుడు సంకేతాలను పంపిస్తుందని తమిళనాడు బీజేపీ చీఫ్ సౌందర రాజన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.