Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి కుమార్తెపై కన్నేసిన విజయ్ దేవరకొండ! (video)

Webdunia
మంగళవారం, 1 అక్టోబరు 2019 (08:48 IST)
టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ. 'అర్జున్ రెడ్డి' చిత్రంతో గుర్తింపు పొంది, గీతగోవిందం చిత్రంతో స్టార్ హీరో ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ యువ హీరో అలనాటి నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌పై కన్నేశాడట. ఆమెను ఎలాగైనా బుట్టలో వేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడట. 
 
అదేసమయంలో జాన్వీ కపూర్ "దఢక్" చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసింది. పైగా, నటనకు మంచి ప్రాధాన్యత ఉండే కథలనే ఎంచుకుంటూ ముందుకుసాగుతోంది. ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటిస్తోంది. అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో ఈ భామను హీరోయిన్‌గా తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
 
ఈ చిత్రానికి ఫైటర్ అనే పేరును ఖరారు చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఈ మూవీని మార్షల్ ఆర్ట్స్ ప్రధానాంశంగా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాతో పూరి జగన్నాథ్… జాన్వీని టాలీవుడ్‌కి తీసుకురాగలరా అనేది చూడాలి. 
 
ప్రస్తుతం తన కుమారుడు ఆకాష్ చిత్రం 'రొమాంటిక్' పనుల్లో పూరి, 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాతో విజయ్ దేవరకొండ బిజీగా ఉన్నారు. వీరిద్దరూ తమ సినిమాలను పూర్తి చేసుకుని జనవరిలో "ఫైటర్" చిత్రాన్ని పట్టాలెక్కించాలని పూరీ జగన్నాథ్ భావిస్తున్నారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments