Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిల్లలు శృంగారం కోరుకుంటే ప్రోత్సహించాలంటున్న హీరోయిన్!!

Advertiesment
పిల్లలు శృంగారం కోరుకుంటే ప్రోత్సహించాలంటున్న హీరోయిన్!!
, సోమవారం, 30 సెప్టెంబరు 2019 (09:56 IST)
బాలీవుడ్‌లో డేరింగ్, డాషింగ్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన వివాదాస్పద నటి కంగనా రనౌత్. ఈమె ఏం మాట్లాడినా అది సంచలనమే అవుతోంది. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లోనేకాదు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకే దారితీశాయి. పిల్లలు శృంగారం (సెక్స్) కోరుకుంటే వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలంటూ హితవు పలికారు. 
 
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే మైండ్ రాక్స్ 2019 సదస్సులో ఆమె పాల్గొని తన మనసులోని విషయాలను బహిర్గతం చేసింది. ముఖ్యంగా, తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఈ క్రమంలోనే తన తొలి ప్రేమ, ముద్దు గురించి ఆమె చర్చించడం హాట్ టాపిక్‌గా మారింది.
 
ఇందులో ఆమె సెక్స్ గురించి స్పందిస్తూ, ప్రతి ఒక్కరి జీవితంలో సెక్స్ అనేది చాలా ముఖ్యం. ఈ విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా ఆ పని చేసేయండి. మనసులో కోరిక పెట్టుకొని, వేచి చూడకండి అంటూ ఉచిత సలహాలు ఇచ్చింది.
 
పైగా, ఒకప్పటిలాగా ఇంట్లో వారు ఎవరినో ఒకరిని వివాహం చేసుకోమంటే.. వారిపైనే ఫీలింగ్స్ పెంచుకోవడమనే విషయాలను ఇప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు శృంగారాన్ని అనుమతించదని తెలుసంటూనే సెక్స్‌పై తన అభిప్రాయాన్ని తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#SyeRaaUSA అమెరికాలో చరిత్ర తిరగరాయనున్న "సైరా"