Vijay Deverakonda: కింగ్ డమ్ సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ

దేవీ
సోమవారం, 24 మార్చి 2025 (08:10 IST)
Vijay Deverakonda
హీరో విజయ్ దేవరకొండ తన కొత్త సినిమా "కింగ్ డమ్" సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్తున్నారు. ఈ సినిమాలోని ఓ లవ్ సాంగ్ ను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు. వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగనుంది. లవ్ సాంగ్స్ చేయడంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ స్పెషాలిటీ అందరికీ తెలిసిందే. "కింగ్ డమ్" లవ్ సాంగ్స్ కు కూడా ఆయన బ్లాక్ బస్టర్ ట్యూన్స్ రెడీ చేశారు. శ్రీలంక వెళ్తున్న విజయ్ ఎయిర్ పోర్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. రౌడీ ట్రెండీ సమ్మర్ వేర్ లో స్టైల్ ఐకాన్ గా కనిపిస్తున్నారు విజయ్.
 
రీసెంట్ గా రిలీజ్ చేసిన "కింగ్ డమ్" టీజర్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఏఐతో వీడియోతో రిలీజ్ చేసిన టీజర్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ (OST)కు కూడా భారీ స్పందన వచ్చింది. "కింగ్ డమ్" చిత్రాన్ని యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య భారీ పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు. "కింగ్ డమ్" సినిమా మే 30న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments