Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండ బ్రేకప్... ముగ్గురితోనా??

Webdunia
గురువారం, 23 మే 2019 (18:21 IST)
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకు ప్రస్తుతం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా... దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోనూ అభిమానులను కలిగి ఉన్నారు. అందుకే, ఆయన సినిమాలను ఇప్పుడు తెలుగులో మాత్రమేకాకుండా దక్షిణాదిన నాలుగు భాషల్లోనూ విడుదల చేస్తూన్నారు.

ఈ మేరకు 'డియర్ కామ్రేడ్' ఇప్పటికే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలకు సిద్ధం కాగా... ఈ మధ్యనే ప్రారంభమైన 'హీరో' సినిమాను సైతం నాలుగు భాషల్లో విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారట. అయితే, ఈ రెండు సినిమాలకు మధ్యలో క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరక్కుతోన్న ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో విజయ్ నటించనున్నారట. 
 
వివరాలలోకి వెళ్తే... 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', 'ఉంగరాల రాంబాబు', 'ఓనమాలు' వంటి మంచి ఆకట్టుకునే సినిమాలను తెరకెక్కించిన క్రాంతి మాధవ్.. ఈ కొత్త సినిమాలో విజయ్‌ని విఫల ప్రేమికుడిగా చూపించబోతున్నారట. ఈ సినిమాలో విజయ్‌కు తాను ప్రేమించిన ప్రతి అమ్మాయితోనూ బ్రేకప్ అయిపోతూంటుందని ఇప్పటివరకు ఉన్న సమాచారం. అందుకే, దీనికి 'బ్రేకప్' అనే టైటల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇజాబెల్లె లైట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరి ముగ్గరితో సినిమాలో విజయ్‌కు బ్రేకప్ అయిపోతుందని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. 
 
విజయ్ దేవరకొండ తన పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ఇప్పటివరకు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ... ప్రతి సినిమాకూ తేడా చూపిస్తూనే వస్తున్నారు. 'అర్జున్ రెడ్డి'లో కాస్త ఎక్కువగానే రొమాన్స్ చేసిన విజయ్‌కు ఆ తర్వాత ఆ స్థాయిలో అవకాశమైతే రాలేదు... కానీ, ‘బ్రేకప్’లో మాత్రం విజయ్ ముగ్గురు హీరోయిన్‌లతో రొమాన్స్ చేసేస్తారట. మరి క్రాంతి మాధవ్ ఈ లవ్ స్టోరీలను మరెంత కొత్తగా చూపించబోతున్నారోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: జగన్ డ్రెస్ కోడ్.. తెల్లటి చొక్కా, ఖాకీ ప్యాంటు కాదు.. తెల్లటి కుర్తా, నల్ల ప్యాంట్

Ghibli Trends: గిబ్లి ట్రెండ్స్‌లో చేరిన నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

Sunrise Beach in Bapatla: బాపట్ల సన్‌రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు

Honour killing in Telangana: పుట్టినరోజే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. తెలంగాణలో పరువు హత్య

మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments