Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాలిసంప‌త్ లో `పాప ఓ పాప`ను విడుద‌ల‌చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ (video)

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (19:30 IST)
Gali sampath song
అనిల్ రావిపూడి స‌మ‌ర్పణ‌లో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్నచిత్రం `గాలి సంప‌త్`. న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ‌ప్ర‌సాద్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అనిల్ ఈ చిత్రానికి స‌మ‌ర్పకుడిగా వ్యవ‌హ‌రించడంతో పాటు స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వ ప‌ర్యవేక్షణ కూడా చేస్తుండ‌డం విశేషం.

అనిల్ కో-డైరెక్టర్, రైట‌ర్, మిత్రుడు ఎస్.క్రిష్ణ నిర్మాత‌గా ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో క‌లిసి అనీష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కి, ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా ఈ మూవీలోని పాప ఓ పాప సాంగ్‌ని క్రేజీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ విడుద‌ల‌చేసి టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.
 
`పాప ఓ పాప నీ పేరు త‌లిచినే మజ్నున‌య్యానే..పాప ఓ పాప నా పేరే మ‌రిచినే పిచ్చోన్న‌య్యానే..
హే పాపా.. అరే నా కోస‌మే నువుపుట్టావే..హే పాపా  నా నిద్ద‌ర‌నే చెడ‌గొట్టావే పాప నా ఎద‌పై నీ కాటుక క‌న్నుల కుంచ‌ల‌తో ఐల‌వ్‌యూ రాసినావే..`` అంటూ హుశారుగా సాగే ఈ పాట‌కి స్టార్ లిరిసిస్ట్ రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యం అందించ‌గా బెన్ని ద‌యాల్‌, బెన్ హ్యూమ‌న్‌, అనుదీప్ దేవ్ ఫుల్ ఎనర్జీతో ఆల‌పించారు. అచ్చురాజ‌మ‌ణి బాణీలు సంగీత ప్రియుల్ని అల‌రిస్తున్నాయి.
 
మొత్తంగా ఈ ట్రైల‌ర్, పాట‌లు చూస్తుంటే వ‌రుస‌గా ఐదు బ్లాక్‌బ‌స్ట‌ర్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మ‌రో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా `గాలి సంప‌త్` రూపొందుతోంది అని తెలుస్తోంది. మార్చి7న  `గాలి సంప‌త్ గ్రాండ్ ప్రీ రిలీజ్` ఈవెంట్‌ని జ‌రిపి మార్చి 11న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను కోరుకున్న చదువు పుస్తకాల్లో లేదు.. అందుకే ఇంటర్‌తో ఆపేశా : పవన్ కళ్యాణ్

15 అడుగుల స్టేజీపై నుంచి కిందపడిన కేరళ ఎమ్మెల్యే ఉమా థామస్ (వీడియో)

Liquor Sales: కొత్త సంవత్సరం.. రెండు రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు రూ.684కోట్ల ఆదాయం

covid 19 చైనాపై మరోసారి పంజా, 170 మంది మృతి, ప్రపంచం బెంబేలు

తెలుపు కాదు.. నలుపు కాదు.. బ్రౌన్ షర్టులో నారా లోకేష్.. పవన్‌ను అలా కలిశారు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments