కలర్ ఫోటో టీజర్ విడుదల చేసిన హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (14:09 IST)
హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి స్పూఫ్‌తో బ్లాక్‌బాస్టర్స్ కొట్టిన అమృత ప్రొడక్షన్స్ నుంచి కలర్ ఫోటో అనే చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. మజిలీ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజు పండగే వంటి చిత్రాల్లో తనదైన కామెడీతో ఆకట్టుకున్న సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు.
 
తెలుగమ్మాయి చాందిని చౌదరీ ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు సునీల్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడులైంది. ప్రముఖ హీరో విజయ దేవరకొండ కలర్ ఫోటో టీజర్‌ని ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.
 
ఈ చిత్రాన్ని ఓ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటెర్టైనెర్‌గా తెరకెక్కిస్తున్నట్లుగా చెప్పుకుంటూ వస్తున్న యూనిట్ సభ్యులు, ఇప్పుడు టీజర్‌ని కూడా అదే పంథాలో రెడీ చేసి రిలీజ్ చేయడం విశేషం. యూట్యూబ్‌లో పాపులరైన సందీప్ రాజ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి అబ్బాయి కాలభైరవ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

120 కిలోల గంజాయి స్వాధీనం.. ఒడిశా నుండి గంజాయి.. ఉపాధ్యాయుడు, భార్య..?

ఫోర్బ్స్ మ్యాగజైన్ 2025- దేశం నుంచి 100మందికి స్థానం.. ఆరుగురు తెలుగువారికి కూడా ప్లేస్

Jagan: అరెరె.. ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారనుకుంటే.. లండన్‌కి జగన్ జంప్ అయ్యారే..

బంధువు గిందువు జాన్తానై.... మా పార్టీ అభ్యర్థే ముఖ్యం : తలసాని శ్రీనివాస్ యాదవ్

నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడిన ట్రంప్.. షాకిచ్చిన కమిటీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

తర్వాతి కథనం
Show comments