Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘జీ 5’లో జ్యోతిక, కార్తీ నటించిన ‘దొంగ’ వరల్డ్‌ డిజిటల్‌ ప్రీమియర్‌

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (14:00 IST)
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ స్పెషల్‌ సినిమాను ‘జీ 5’ ఒటీటీ తెలుగు ప్రజల ముందుకు తీసుకొస్తోంది. లాక్‌డౌన్‌లో డైరెక్ట్‌–టు–డిజిటల్‌ ఎక్స్‌క్లూజివ్‌ రిలీజ్‌ సినిమాలు ‘అమృతరామమ్‌’, ‘47 డేస్‌’, ‘బెలూన్‌’, ఇటీవల ఒరిజినల్‌ మూవీ ‘మేక సూరి’ సహా కామెడీ సిరీస్‌ ‘అమృతం ద్వితీయం’, పలు ఒరిజినల్‌ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి’, ‘లూజర్’ వంటివి ‘జీ 5’లో విడుదలయ్యాయి. ఇప్పుడీ ఓటీటీలో మరో సినిమా విడుదల కానుంది.
 
జ్యోతిక, కార్తీ కలిసి నటించిన తొలి చిత్రం ‘దొంగ’. నిజ జీవితంలో వదిన, మరిది అయిన వీళ్లిద్దరూ ఈ చిత్రంలో అక్కాతమ్ముళ్లుగా నటించడం విశేషం. ఆగస్టు 14న ఈ సినిమా ‘జీ 5’లో విడుదల కానుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘దొంగ’ వరల్డ్‌ డిజిటల్‌ ప్రీమియర్‌కి ‘జీ 5’ సిద్ధమైంది.
 
‘దృశ్యం’ మాతృక, మలయాళంలో ఘన విజయం సాధించిన ‘దృశ్యం’ చిత్రానికి దర్శకత్వం వహించిన జీతూ జోసేఫ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. సత్యరాజ్‌ తండ్రి పాత్ర పోషించిన ఈ చిత్రంలో కార్తీ సరసన ‘మేడ మీద అబ్బాయి’, ‘గాయత్రి’ ఫేమ్‌ నిఖిలా విమల్‌ నటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీతో సహా ఆ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments