Webdunia - Bharat's app for daily news and videos

Install App

''నోటా''ను అప్పటివరకు విడుదల చేయకండి..

చేతినిండా సినిమాలతో బిజీగా వున్న హీరో విజయ్ దేవరకొండ త్వరలో హిందీ సినిమాలో కూడా నటించనున్నాడు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. దీనికి రాజ్-డీకే దర్శక ద్వయం దర్శకత్వం వహించనున్నట్టు

Webdunia
బుధవారం, 19 సెప్టెంబరు 2018 (17:30 IST)
చేతినిండా సినిమాలతో బిజీగా వున్న హీరో విజయ్ దేవరకొండ త్వరలో హిందీ సినిమాలో కూడా నటించనున్నాడు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. దీనికి రాజ్-డీకే దర్శక ద్వయం దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు విజయ్ దేవరకొండ తాజా సినిమా నోటా విడుదలకు సిద్ధమవుతోంది. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. 
 
జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాను వచ్చేనెలలో తెలుగు.. తమిళ భాషల్లో విడుదల చేయాలనుకున్నారు. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంభాషణలను సమకూర్చిన శశాంక్ వెన్నెలకంటి, నిర్మాత జ్ఞానవేల్ రాజాపై చెన్నై పోలీస్ కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు.
 
నోటా తెలుగు వెర్షన్ కోసం దర్శకుడు ఆనంద్ శంకర్ తనతో మాటలు రాయించుకున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్లో మాటల రచయితగా తనకు ఇవ్వకుండా తన పేరు వేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ట్రైలర్లో వున్న డైలాగ్స్ తనవే.. అయితే కథ, స్క్రీన్ ప్లేతో పాటు మాటల క్రిడిట్ కూడా ఆనంద్ శంకర్ అని వేసుకున్నట్లు ఆరోపించాడు. 
 
తెలుగు వెర్షన్ డైలాగ్స్ రాసినందుకు తనకు రావలసిన డబ్బులతో పాటు, క్రెడిట్ కూడా ఇవ్వాలి. అప్పటివరకూ ఈ సినిమాను విడుదల కాకుండా చూడాలంటూ ఫిర్యాదులో కోరాడు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments