Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజ‌య్ దేవ‌ర‌కొండ నా బంగారం అంటోన్న చార్మి

Webdunia
ఆదివారం, 9 మే 2021 (20:07 IST)
charmi- vijay
విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన‌రోజు ఈరోజే. ఆదివారం మే9. ఈ సంద‌ర్భంగా విజ‌య్‌లో తాను ప‌రిశీలించిన అంశాల‌ను న‌టి, నిర్మాత చార్మి కౌర్ షేర్ చేసుకుంది. పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. ఒక్క మాట‌లో నిన్ను డిఫైన్ చేయాలంటే 26 కేరెట్ల బంగా.....రం అంటూ కితాబిచ్చింది. అంతేకాకుండా,  నేను, పూరి జ‌గ‌న్నాథ్‌గారికి నువ్వంటే అపామ‌ర‌మైన ప్రేమ అంటూ పూరీ త‌ర‌ఫున కూడా త‌నే చెప్పేసింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో దిగిన ఫొటోను ఈరోజు పుట్టిన రోజు సంద‌ర్భంగా పోస్ట్ చేసింది.
 
విజ‌య్ దేవ‌ర‌కొండ `లైగ‌ర్` అనే సినిమా చేస్తున్నాడు. పూరీ క‌నెక్ట్స్ బేన‌ర్‌లో చార్మి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ వాయిదా ప‌డింది. ఇది పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోంది. ముంబైతోపాటు విదేశాల‌లో షూటింగ్ జ‌ర‌గాల్సివుంది. స‌గ భాగం అయిన త‌ర్వాత క‌రోనా సెకండ్ వేవ్ రావ‌డంతో షూటింగ్ వాయిదా ప‌డింది. మ‌రోవైపు టీజ‌ర్ ను కూడా వాయిదా వేశారు.
 
ఆ త‌ప్పు చేయ‌ను
ఇదిలా వుండ‌గా, ఇటీవ‌లే చార్మికి పెళ్లి నిశ్చ‌యం అయింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ అటువంటి వార్త‌లో నిజం లేద‌ని నిన్న రాత్రి ఓ లెట‌ర్‌ను రాసింది. ప్ర‌స్తుతం నా కెరీర్‌లో బెస్ట్ ఫేజ్‌లో వున్నాను. చాలా హ్యాపీగా వున్నాను. నా జీవితంలో వివాహం చేసుకోవడంలాంటి తప్పు నేను ఎప్పటికీ చేయను అని తేల్చి చెప్పింది. అవును గ‌దా. ఆ త‌ప్పు ఎందుకు చేస్త‌ది అంటూ విశ్లేష‌కులు కూడా ఏకీభ‌విస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Roja: భయం అనేది మా నాయకుడు జగన్ రక్తంలో లేదు.. ఆర్కే రోజా (video)

Chandrababu: అంబేద్కర్‌ను గుర్తించడంలో కీలక పాత్ర ఎవరిది..? చర్చ జరగాల్సిందే.. చంద్రబాబు

పట్టపగలే చైన్ స్నాచింగ్.. కాలింగ్ బెల్ కొట్టి మహిళ మెడలోని..? (video)

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments