Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ చేతులు మారింది..!

Webdunia
సోమవారం, 4 మే 2020 (14:09 IST)
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ఫైటర్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ముంబాయిలో నలభై రోజులు షూటింగ్ జరుపుకుంది. ఏప్రిల్ నెలలో తాజా షెడ్యూల్ ప్రారంభించాలి అనుకుంటే.. లాక్ డౌన్ వలన షూటింగ్స్ ఆగిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాని పూరి - ఛార్మి - కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 
 
విజయ్ దేవరకొండ - బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటిస్తున్న ఈ సినిమా ముంబాయి బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత విజయ్ నిన్నుకోరి, మజిలీ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు ఎనౌన్స్ చేసారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు నిర్మించనున్నట్టు ఎనౌన్స్ చేసారు. 
 
అయితే.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేతులు మారిందని తెలిసింది. అవును.. విజయ్ - శివ నిర్వాణ కాంబినేషన్లో రూపొందే మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్నట్టు తెలిసింది. కారణం ఏంటంటే.. విజయ్‌తో మైత్రీ సంస్థ హీరో అనే సినిమాని ప్రారంభించింది. ఈ సినిమా కొంత షూటింగ్ జరిగిన తర్వాత ఆగిపోయింది. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది.
 
 అందుచేత మైత్రీ వాళ్లకు సినిమా చేస్తానని మాట ఇచ్చారు విజయ్. అందుకనే పూరితో సినిమా అయిన తర్వాత దిల్ రాజు బ్యానర్ లో చేస్తానన్న సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో చేస్తున్నాడని తెలిసింది. అదీ..మేటరు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments