Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లంటూ చేసుకుంటే వరంగల్ అమ్మాయినే చేసుకుంటా: అర్జున్ రెడ్డి

''అర్జున్ రెడ్డి''తో గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ.. తాజాగా గీతాఆర్ట్స్ పతాకంపై ఓ సినిమా చేస్తున్నారు. తాజాగా హనుమకొండలో ఓ షోరూమ్‌ను ప్రారంభించేందుకు వచ్చిన విజయ్ దేవర కొండ.. వరంగల్ అమ్మాయిన

Webdunia
శనివారం, 13 జనవరి 2018 (10:29 IST)
Vijay Devarakonda
''అర్జున్ రెడ్డి''తో గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ.. తాజాగా గీతాఆర్ట్స్ పతాకంపై ఓ సినిమా చేస్తున్నారు. తాజాగా హనుమకొండలో ఓ షోరూమ్‌ను ప్రారంభించేందుకు వచ్చిన విజయ్ దేవర కొండ.. వరంగల్ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చాడు. దీంతో అభిమానులు కేరింతలు కొట్టారు. తనకు పెళ్లంటూ జరిగితే అది ఇక్కడి అమ్మాయితోనేనని తేల్చి చెప్పాడు.
 
తనను చూసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపిన వారితో సరదాగా గడిపిన విజయ్, కాసేపు సినిమా డైలాగులు చెప్పి వారిని అలరించాడు. ఇక విజయ్ మనసులో ఎవరైనా వరంగల్ అమ్మాయి ఉందా? ఉంటే ఆమె ఎవరు? అని ఫిలిమ్ నగర్ వర్గాల్లో అప్పుడే చర్చలు మొదలయ్యాయి. 
 
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేసేందుకు, నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు లఘు చిత్రాలను రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌తో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలు, సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ లఘు చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి, యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండలు కనిపించనున్నారు. 
 
రాజమౌళి ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ లాంటి స్టార్ ఈ హీరో క్యాంపెయిన్ లో చేరటం వల్ల మరింత ప్రచారం లభిస్తుందని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీట్ శిక్షణ పొందుతున్న విద్యార్థినిపై ఇద్దరు టీచర్ల లైంగికదాడి...

2025 సంవత్సరానికిగాను సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కారు

యువకుడిపై దాడి చేసిన పెద్దపులి... ఏవోబీలో కలకలం...

ఇకపై వచ్చే తుఫానులన్నీ తీవ్ర ప్రభావం చూపుతాయి...

జనాభాను పెంచేందుకు రష్యాలో శృంగారపు మంత్రి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments