Webdunia - Bharat's app for daily news and videos

Install App

"లైగర్" లాస్ట్ షెడ్యూల్.. గుమ్మడికాయ కొట్టేస్తున్నారుగా..!

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (12:48 IST)
డాషింగ్ డైరెక్టర్ ఫూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ "లైగర్". బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ లైగర్‌లో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే మైక్ టైసన్‌కు సంబంధించిన షూట్ అమెరికాలో కంప్లీట్ అయింది. 
 
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు. ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్‌లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్  హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నారు.
 
ఈ సినిమాకు సంబంధించిన వరుసగా అప్‌డేట్స్‌ ఇస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లాస్ట్ షెడ్యూల్‌ ప్రారంభమైంది. దీంతో ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ గుమ్మడికాయ కొట్టేయనున్నారు. ఇక పూరీ కెరీర్‌లో ఓ సినిమా కోసం ఎక్కువ రోజులు పని చేయడం ఇదే మొదటిసారి అనే చెప్పాలి.
 
ఈ సినిమా టీజర్‌లో విజయ్ దేవరకొండను ఊర మాస్ లెవల్లో చూపించారు పూరీ జగన్నాథ్. యాక్షన్ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. ఈ సినిమాతో విజయ్‌కు పూరీ జగన్నాథ్ సాలిడ్ హిట్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

మరింతగా ముదరనున్న ఓట్ల చోరీ కేసు : సీఈసీపై విపక్షాల అభిశంసన!?

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి (video)

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments