Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీసెంట్ టాక్‌తో "ఇంద్రసేన" కలెక్షన్ల వర్షం

పక్కా కమర్షియల్ సినిమాలకు, ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలకు ఉండే ప్రధానమైన వ్యత్యాసం తొలివారం వసూళ్లే. టాక్‌తో సంబంధం లేకుండా తొలివారం కమర్షియల్ సినిమాలు భారీ ఓపెనింగ్స్‌ను సాధిస్తే.. మౌత్ టాక్‌తో రోజురో

Webdunia
ఆదివారం, 10 డిశెంబరు 2017 (15:20 IST)
పక్కా కమర్షియల్ సినిమాలకు, ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలకు ఉండే ప్రధానమైన వ్యత్యాసం తొలివారం వసూళ్లే. టాక్‌తో సంబంధం లేకుండా తొలివారం కమర్షియల్ సినిమాలు భారీ ఓపెనింగ్స్‌ను సాధిస్తే.. మౌత్ టాక్‌తో రోజురోజుకు పుంజుకునే ఫ్యామిలీ సినిమాలు లాంగ్ రన్‌లో విజయవంతమైన మూవీలుగా నిలుస్తున్నాయి.
 
తాజాగా విజయ్ ఆంటోనీ నటించిన చిత్రం "ఇంద్రసేన". ఈ చిత్రం ప్రేక్షకుల మౌత్ టాక్‌తో మంచి వసూళ్లను రాబడుతోంది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల ఆదరణతో తొలివారం అనంతరం వస్తున్న వసూళ్లు "ఇంద్రసేన‌"ను డీసెంట్ హిట్ దిశగా తీసుకెళుతున్నాయి. 
 
విడుదలకు ముందే కమర్షియల్ సక్సెస్‌ను అందుకున్న విజయ్ ఆంటోనీ, ఇప్పుడు కంటెంట్‌‍పరంగా తనదైన మార్క్‌ను ఇంద్రసేనతో మరోసారి చాటుకున్నాడు. ఇటు తెలుగు అటు తమిళంలో వరుస కమర్షియల్ సక్సెస్‌లను సాధిస్తూ, త్వరలోనే తనకు బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన 'బిచ్చగాడు', 'ఇంద్రసేన' తరహాలోనే మరొక విభిన్నమైన కథాశంతో విజయ్ ఆంటోనీ ఆడియన్స్ ముందుకు రానున్నాడు. 
 
విజయ్ ఆంటోనీ, డైనా చంపిక, మహిమా, జ్వెల్ మారీ, రాధారవి, కాళీ వెంకట్, నళినీకాంత్, సింధు రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి  మాటలు - సాహిత్యం: భాష్యశ్రీ, ఆర్ట్ : ఆనంద్ మణి, సంగీతం - కూర్పు: విజయ్ ఆంటోనీ, సినిమాటోగ్రఫీ : కె.దిల్ రాజ్, లైన్ ప్రొడ్యూసర్: శాండ్రా జాన్సన్, నిర్మాతలు:నీలం కృష్ణారెడ్డి, రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోనీ, దర్శకత్వం: జి.శ్రీనివాసన్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

నా కోడలికి వివాహేతరం సంబంధం, భరించలేకే నా కొడుకు సూసైడ్: తల్లి ఆరోపణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments