Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓవర్సీస్‌లో కలెక్షన్ల కింగ్ ఎవరు?

ప్రపంచ క్యాలెండర్ చరిత్రపుటల్లో మరో యేడాది కలిసిపోనుంది. మరికొన్ని రోజుల్లో 2017వ సంవత్సరం ముగియనుంది. ఈ యేడాది అంకంలో అంటే డిసెంబరు నెలలో అక్కినేని అఖిల్ నటించిన 'హలో', నేచురల్ స్టార్ నాని నటించిన "ఎ

Advertiesment
Overseas Collections
, ఆదివారం, 3 డిశెంబరు 2017 (08:56 IST)
ప్రపంచ క్యాలెండర్ చరిత్రపుటల్లో మరో యేడాది కలిసిపోనుంది. మరికొన్ని రోజుల్లో 2017వ సంవత్సరం ముగియనుంది. ఈ యేడాది అంకంలో అంటే డిసెంబరు నెలలో అక్కినేని అఖిల్ నటించిన 'హలో', నేచురల్ స్టార్ నాని నటించిన "ఎంసీఏ" (మిడిల్ క్లాస్ అబ్బాయి) వంటి సినిమాలు మినహా చెప్పుకోదగ్గ చిత్రాలు విడుదలకు నోచుకోలేదు. 
 
ఏదిఏమైనా ఈ యేడాది సినీ పరిశ్రమకు భారీస్థాయిలోనే హిట్స్ లభించాయని చెప్పవచ్చు. సంక్రాంతికి వచ్చిన చిరంజీవి సినిమా "ఖైదీ నెం.150", బాలయ్య "గౌతమీపుత్ర శాతకర్ణి" సినిమాలు యేడాది ఆరంభంలోనే దుమ్మురేపాయి. వాటితోపాటు వచ్చిన 'శతమానం భవతి' సినిమా కూడా హిట్ టాక్‌ను సొంతం చేసుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది. 
 
ఆ తర్వాత వచ్చిన స్టార్ హీరోల సినిమాలతోపాటు.. చిన్న సినిమాలు కూడా భారీ స్థాయిలోనే విజయం సాధించాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సినిమాలకు కలెక్షన్ల వర్షం కురిపించినా.. ఓవర్సీస్ విషయానికి వచ్చేసరికి ఊసురమనిపించాయి. ఓవర్సీస్‌లో క్లాస్ అండ్ ఫ్యామిలీ, డిఫరెంట్ కథాంశంతో వచ్చిన సినిమాలకు ఎన్నారైలు బ్రహ్మరథం పడతారు. పట్టారు కూడా. మరి ఈ యేడాది ఓవర్సీస్‌లో కలెక్షన్లలో దుమ్మురేపిన సినిమాలేంటో ఓ లుక్కేయండి.
 
బాహుబలి-2 : 20.47 మిలియన్ డాలర్లు
ఖైదీ నెం.150 : 2.45 మిలియన్ డాలర్లు
ఫిదా : 2.07 మిలియన్ డాలర్లు
అర్జున్‌ రెడ్డి : 1.78 మిలియన్ డాలర్లు
గౌతమిపుత్ర శాతకర్ణి : 1.66 మిలియన్ డాలర్లు
స్పైడర్ : 1.56 మిలియన్ డాలర్లు
జై లవకుశ : 1.56 మిలియన్ డాలర్లు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరోల చేతిలో తన్నులు తినేందుకు సిద్ధమంటున్న హీరో!