Webdunia - Bharat's app for daily news and videos

Install App

చందమామ కథే సినిమా తీశా: విజయ్‌ ఆంటోని

చందమామ పుస్తకంలో బేతాళుడు కథ ఆధారంగా తీసిన సినిమానే 'భేతాళుడు'. ఈ కథను ప్రముఖ రచయిత సుజాత రచించారు. ఆయన చందమామ కథను స్ఫూర్తిగా తీసుకుని రాసివుంటారని ఆయన చెప్పారు.

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (18:20 IST)
చందమామ పుస్తకంలో బేతాళుడు కథ ఆధారంగా తీసిన సినిమానే 'భేతాళుడు'. ఈ కథను ప్రముఖ రచయిత సుజాత రచించారు. ఆయన చందమామ కథను స్ఫూర్తిగా తీసుకుని రాసివుంటారని ఆయన చెప్పారు. శనివారం హైదరాబాద్‌ వచ్చిన విజయ్‌ ఆంథోని.. తమిళంలో రెండు రోజులకే రూ.6 కోట్లు పైగా వసూలు రాబట్టింది. తెలుగులోనూ మంచి ఓపెనింగ్స్‌ వచ్చాయి. తెలుగు ప్రేక్షకులకు రుణపడివుంటాను. త్వరలో నేనే డబ్బింగ్‌ చెప్పుకుంటూ పెద్ద సినిమాను తీయబోతున్నాను అన్నారు.
 
విజయ్‌ ఆంటోని హీరోగా మల్కాపురం శివకుమార్‌, ఫాతిమా విజయ్‌ ఆంటోని సమర్పణలో మానస్‌ రిషి ఎంటర్‌ప్రైజెస్‌, విన్‌ విన్‌ విన్‌ క్రియేషన్స్‌, ఆరా సినిమాస్‌ బ్యానర్స్‌పై ప్రదీప్‌ కష్ణమూర్తి దర్శకత్వంలో కె.రోహిత్‌, ఎస్‌.వేణుగోపాల్‌ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'భేతాళుడు'.  ఈ చిత్రం సక్సెస్‌ పట్ల హీరో విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ... ఈ సినిమాను తెలుగు, తమిళంలో 1300 థియేటర్స్‌కు పైగా విడుదల చేశారు. తెలుగు, తమిళం నుండి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ఇకపై నేను చేసే సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో కూడా చిత్రీకరిస్తాను. నా తదుపరి చిత్రం 'యముడు'. మరో రెండు, మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది' అన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments