Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అమీర్‌పేటలో' యూత్‌ ఆలోచనలు.. రారమ్మంటున్న సారథి

ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌ వచ్చినవారంతా అమీర్‌పేటకు రావాల్సిందే. ఆ పేరు వినగానే గుర్తుకువచ్చేది పాంప్లెట్లు, బ్యానర్లు, ట్రైనింగ్‌ ఇన్న్సిటూట్లూ, రద్దీగా ఉండే జనం. చాలామంది యువతీ యువకులు ఆలోచనలు అక్

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (18:18 IST)
ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌ వచ్చినవారంతా అమీర్‌పేటకు రావాల్సిందే. ఆ పేరు వినగానే గుర్తుకువచ్చేది పాంప్లెట్లు, బ్యానర్లు, ట్రైనింగ్‌ ఇన్న్సిటూట్లూ, రద్దీగా ఉండే జనం. చాలామంది యువతీ యువకులు ఆలోచనలు అక్కడకి రాగానే మారిపోతుంటాయి. చాలామంది కెరీర్‌ కోసం ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఆలోచిస్తూ సక్సెస్‌ సాధిస్తే.. మరికొందరు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని అనుకుంటారు. ఆ పక్కనే వున్న సారధీ స్టూడియోస్‌ రా రమ్మని పలుకరిస్తుంది. అలా దానికి ఆకర్షితుడైన హీరో కథతో 'అమీర్‌పేటలో' చిత్రం రూపొందింది. అక్కడే కొన్నాళ్ళు జనాలను పరిశీలించి తీసిన సినిమా ఇది. 
 
ఈష, రాజు, తిలక్‌, రాజశేఖర్‌, శేఖర్‌ తదితరులు తారాగణంగా నటించారు. పద్మశ్రీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై యామిని బ్రదర్స్‌ సమర్పణలో మహేష్‌ మందలపు నిర్మాణ సారథ్యంలో శ్రీ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించరు. శ్రీ, అశ్విని హీరోయిన్‌గా నటించారు. ఏడాదిపైగా పూర్తయిన ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మయూరి డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ముందుకు వచ్చింది. ఈనెల 16న విడుదల చేస్తుంది.
 
హీరో, దర్శకుడు శ్రీ మాట్లాడుతూ.. మమూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్‌ వారి సహకారంతో సినిమాను విడుదల చేస్తున్నాం. వంశీ, ప్రవీణ్‌ సహకారాన్ని మరచిపోలేను. ఏ దర్శకుడు అయినా కథ రాసుకున్న తర్వాత అతనికి మంచి టీం సహకారం ఉండాలి. అలాంటి మంచి టీం నాకు దొరికింది. మురళి, అశ్విని, నిర్మాత మహేష్‌ సహా టీం అందరూ ఎంతగానో సపోర్ట్‌ చేశారు. అమీర్‌ పేట అనగానే మనకు చాలా విషయాలు గుర్తుకు వస్తుంటాయి. అలా అమీర్‌పేటలోని జీవితాలను చూపిస్తూనే, మంచి కథను తెరపై చూపించబోతున్నాం. ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఎమోషనల్‌ కంటెంట్‌ కూడ ఉన్న సినిమా. ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూసి ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది. మా ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments