Webdunia - Bharat's app for daily news and videos

Install App

దగ్గుబాటి పెళ్లిలో సందడి చేయనున్న చైతూ శామ్

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (12:15 IST)
ఇటీవలే టాలీవుడ్ స్టార్ వెంకీ కుమార్తె ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ ఆర్ సురేందర్ రెడ్డి మనవడితో పెళ్లి జరిపించబోతున్నట్లు తెలియజేసారు. అయితే నిశ్చితార్థం కూడా చాలా కొద్ది మంది సన్నిహితుల మధ్య ఎటువంటి హడావుడి లేకుండా చాలా ప్రైవేట్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక్క ఫోటో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. 
 
ఈ వివాహాన్ని ఈ వారంలోనే జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజస్థాన్‌లో జరగనున్న ఈ వివాహానికి ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారట. ఇప్పటికే పెళ్లికి ముందు చేసే వేడుకలు రాజస్థాన్‌లో ప్రారంభమయ్యాయి. సంగీత్ కార్యక్రమం కోసం రానా, నాగచైతన్య, సమంత ప్రిపేర్ అయినట్లు సమాచారం. 
 
అయితే పెళ్లి కార్యక్రమాలకు సంబంధించి ఎటువంటి ఫోటోలు మీడియాకు లీక్ కాకుండా దగ్గుబాటి ఫ్యామిలీ చాలా జాగ్రత్తగా ఉన్నారట. అయితే పెళ్లి పూర్తయ్యాక రిసెప్షన్ మాత్రం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ రిసెప్షన్‌కు సినీ ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు అభిమానులను కూడా ఆహ్వానించాలని భావిస్తున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏప్రిల్ 28న గుంటూరు మేయర్ ఎన్నికలు

AP SSC Exam Results: ఏపీ పదవ తరగతి పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి

Pahalgam: వెళ్ళు, మీ మోదీకి చెప్పు.. బాధితుడి భార్యతో ఉగ్రవాదులు

పహల్గామ్ దాడి.. విమానాశ్రయంలోనే ప్రధాని మోడీ ఎమర్జెన్సీ మీటింగ్

పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి ఇతడేనా? ఫోటో రిలీజ్!? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments