Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ‌యాస‌తో `త్వ‌ర‌లో వెంకీ పింకీ జంప్`

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (12:39 IST)
Opening photo
Harishrao clap
`ప్రేమ పిలుస్తోంది` చిత్రంతో ద‌ర్శ‌కుడుగా గుర్తింపు తెచ్చుకున్న అజ‌య్ నాత‌రి ద‌ర్శ‌క‌త్వంలో  శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ ప‌తాకంపై  శ్రీమ‌తి ల‌క్ష్మీరేసు స‌మ‌ర్పణ‌లో వెంక‌ట్ ఆర్ నిర్మిస్తోన్న చిత్రం `త్వ‌ర‌లో వెంకీ పింకీ జంప్‌`. విక్ర‌మ్, దేవ‌కి ర‌మ్య, హ‌ర్సిత హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రం ప్రారంభోత్స‌వం ఇటీవ‌ల గ్రాండ్ గా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆర్థికశాఖ మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు తొలి స‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌గా,మెద‌క్ ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. మున్పిప‌ల్ ఛైర్మ‌న్ రాజ‌న‌ర్సు‌, క‌ళాంజ‌లి రాజేష్ పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.
 
అనంత‌రం మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ, పూర్తిగా తెలంగాణ యాస‌, భాష‌ల‌తో తెలంగాణ క‌ళాకారుల‌తో ఈ చిత్రం రూపొందుతోంది .సిద్దిపేట‌లోనే షూటింగ్ మొత్తం జ‌రుపుకోనుంది. టైటిల్ ఆస‌క్తిక‌రంగా ఉంది. నిర్మాత వెంక‌ట్ కు, ద‌ర్శ‌కుడు అజ‌య్ కు ఈ చిత్రం మంచి పేరు తీసుకరావాల‌ని`` అన్నారు.
నిర్మాత వెంక‌ట్ ఆర్‌, ద‌ర్శ‌కుడు అజ‌య్ నాతరి మాట్లాడుతూ,``ల‌వ్ అండ్ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం. దాదాపు రెండు నెల‌ల పాటు సింగిల్ షెడ్యూల్లో ఈ చిత్రాన్ని సిద్దిపేట ప‌రిస‌ర ప్రాంతాల్లో పూర్తి చేస్తాం``అన్నారు.

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments