Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్న‌య్యపై సెటైర్ వేసిన త‌మ్ముడు వెంకీ

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2019 (20:08 IST)
టాలీవుడ్లో రూపొందిన క్రేజీ, భారీ మ‌ల్టీస్టార‌ర్ వెంకీ మామ‌. వెంక‌టేష్, నాగ చైత‌న్య కాంబినేష‌న్లో రూపొందిన వెంకీ మామ రిలీజ్ డేట్ గురించి నెటిజ‌న్లు చాలా సెటైర్స్ వేయ‌డం తెలిసిందే. వెంకీ మామ ఎప్పుడ‌మ్మా.. అని ట్రోలింగ్ చేయ‌డంతో ఇది బాగా పాపుల‌ర్ అయ్యింది. ఈ ట్రోలింగ్, సెటైర్స్‌ని వెంకీ మామ టీమ్ బాగా ఉప‌యోగించుకుంటుంది. ఈ మూవీ రిలీజ్ డేట్‌ని ఎనౌన్స్ చేయ‌డానికి రానా ఈ సెటైర్స్‌ని ఉప‌యోగించుకున్న విష‌యం తెలిసిందే.
 
ఇక ఇప్పుడు వెంక‌టేష్ కూడా ఈ సెటైర్‌ని ఉప‌యోగించుకుని స్టేజ్ పైన కామెడీ చేసాడు. వెంకీ మామ ప్రెస్ మీట్లో వెంక‌టేష్ మాట్లాడ‌డానికి స్టేజ్ పైకి వ‌చ్చి... థ్యాంకూ దేవుడా… ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను. థ్యాంక్యూ సురేష్ ప్రొడ‌క్ష‌న్‌.. థ్యాంక్యూ అన్న‌య్య‌.. అంటూ క‌న్నీళ్లు తుడుచుకుంటున్న‌ట్టు యాక్ట్ చేసి, త‌న‌దైన శైలిలో న‌వ్వించాడు వెంకీ. 
 
వెంకీ ఇంకా మాట్లాడుతూ...  నా కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేశాను. కానీ వెంకీమామ సినిమాకి వచ్చేటప్పటికీ నా కల నిజమైందని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఎప్ప్పుడు రానా, చైతన్యలతో వర్క్ చేయాలి అనుకునేవాడిని. నాన్నగారు కూడా మా అందరితో సినిమా తీయాలని కోరుకునేవారు. ఆయన ఉండుంటే ఈ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేసేవారు.

నాన్నా ఈ సినిమా మీ కోసమే.. చైతన్యని మీరు చాలా సినిమాల్లో చూశారు. కానీ ఈ సినిమాలో ఆల్ రౌండర్ పెర్ఫార్మెన్స్ చేశాడు. ప్రతి ఎమోషన్ చక్కగా పండించాడు. ఈ సినిమా చైతన్యతో చేయడం హ్యాపీగా ఉంది అన్నారు.
   

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments