Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాను మహాద్భుతంగా చూపించే దర్శకుడు రాజమౌళి : వెంకయ్య

ప్రపంచంలో ఉన్న ఏడు అద్భుతాల‌ను కూడా మ‌హాద్భుతంగా చూపించ‌గ‌లిగేది సినిమా, అటువంటి సినిమాను మ‌రింత అద్భుతంగా చూపించ‌గ‌లిగే వ్యక్తి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. హై

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (06:50 IST)
ప్రపంచంలో ఉన్న ఏడు అద్భుతాల‌ను కూడా మ‌హాద్భుతంగా చూపించ‌గ‌లిగేది సినిమా, అటువంటి సినిమాను మ‌రింత అద్భుతంగా చూపించ‌గ‌లిగే వ్యక్తి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. హైద‌రాబాద్ శిల్ప క‌ళా వేదిక‌లో  అక్కినేని నాగేశ్వ‌ర రావు జాతీయ పుర‌స్కారాన్ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి ఆయన ప్రదానం చేశారు. 
 
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ, రాజ‌మౌళి చిన్న వ‌య‌సులోనే ఎంతో పేరు సంపాదించుకున్నాడని అన్నారు. తెలుగు సినిమాను అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. అక్కినేని పురస్కారాన్ని రాజమౌళికి ఇవ్వడం సముచితమని అభిప్రాయపడ్డారు. 
 
ఇకపోతే.. ప్ర‌పంచ ఏడు వింత‌ల‌కు ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు త‌న‌దైనశైలిలో కొత్త అర్థం చెప్పారు. ప్ర‌పంచంలో అద్భుతాల్లో ఒక‌టి చూడ‌గ‌ల‌గడం, రెండు విన‌గ‌ల‌గ‌డం, మూడు స్ప‌ర్శ, నాలుగు రుచి, ఐదు అనుభూతిని పొంద‌డం, ఆరు న‌వ్వ‌డం, ఏడు ప్రేమించ‌డం అని చెబుతుందన్నారు. ఈ ఏడు అద్భుతాల‌ను కూడా మ‌హాద్భుతంగా చూపించ‌గ‌లిగేది సినిమా అని వెంక‌య్య నాయుడు అన్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments