Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రులిద్దరూ కలహాలుమాని తెలుగు భాషాభివృద్ధికి కృషిచేయాలి : ఉపరాష్ట్రపతి వెంకయ్య

రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఓ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రులిద్దరూ కలహాలుమాని కలిసిమెలిసి పని చేస్తూ ఇరు రాష్ట్రాల ప్రగతి, తెలుగు భాషాభివృద్ధి కోస

Advertiesment
చంద్రులిద్దరూ కలహాలుమాని తెలుగు భాషాభివృద్ధికి కృషిచేయాలి : ఉపరాష్ట్రపతి వెంకయ్య
, సోమవారం, 21 ఆగస్టు 2017 (14:14 IST)
రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఓ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రులిద్దరూ కలహాలుమాని కలిసిమెలిసి పని చేస్తూ ఇరు రాష్ట్రాల ప్రగతి, తెలుగు భాషాభివృద్ధి కోసం కృషి చేయాలని ఆయన కోరారు. 
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వెంకయ్యకు సోమవారం హైదరాబాద్‌లో పౌర సన్మానం జరిగింది. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు.. గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తెలుగు భాషకు గ్లామర్ మాత్రమే కాదని, గ్రామర్ కూడా ఉందన్నారు. ఇదే సందర్భంలో తాను ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల నుంచి రెండు కోర్కెలను ఆశిస్తున్నట్టు చెప్పారు. సమస్యలను ఇద్దరూ కలసి మాట్లాడుకుని పరిష్కరించుకోవడం అందులో ఒకటిగా పేర్కొన్నారు. తెలుగు భాషకు ప్రాధాన్యం ఇవ్వడం రెండోదని చెప్పారు.
 
ఇంగ్లీష్ జబ్బు మనల్ని చాలా కాలంగా పట్టుకుని ఉందని, ఇది పోవడం అంతసులభం కాదన్నారు. దీనికి మందు కూడా లేదన్న విషయం తెలుసన్నారు. ఒక అంటు వ్యాధిలా బాగా వ్యాపించిందన్న ఆయన తాను ఇంగ్లీష్ భాషకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. భారత ఉపరాష్ట్రపతిగా ఆ విషయం తనకు తెలుసని చెప్పారు. అంతర్జాతీయ వేదికలపై, రాజ్యసభ చైర్మన్‌గా తాను కూడా ఇంగ్లీష్‌లో మాట్లాడుతూనే ఉంటానన్నారు. 
 
అయితే, భాష, భావం రెండూ కలసి ఉండాలన్నది తన అభిప్రాయంగా పేర్కొన్నారు. భాష ద్వారానే మన సంస్కృతిని వ్యక్తం చేయగలమన్న ఆయన దాన్ని మర్చిపోరాదన్నారు. కన్నతల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోయిన వాడు తన దృష్టిలో మానవుడే కాదన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నంద్యాల ఉప ఎన్నికల్లో శిల్పామోహన్ రెడ్డి గెలుపు సాధ్యమా..?