Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళ జననాంగంపై జెల్ పూసి మరీ రేప్ చేసిన ఫెర్టిలిటీ డాక్టర్

మహారాష్ట్రలోని థానేలో ఓ మహిళపై వైద్యుడు అత్యాచారం చేశాడు. పిల్లలు పుట్టలేదనీ, సరోగసీ వైద్య చికిత్స కోసం వెళ్లిన ఓ మహిళను బెడ్‌పై పడుకోబెట్టిమరీ ఫెర్టిలిటీ డాక్టర్ రేప్ చేసిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి

Advertiesment
మహిళ జననాంగంపై జెల్ పూసి మరీ రేప్ చేసిన ఫెర్టిలిటీ డాక్టర్
, సోమవారం, 21 ఆగస్టు 2017 (11:41 IST)
మహారాష్ట్రలోని థానేలో ఓ మహిళపై వైద్యుడు అత్యాచారం చేశాడు. పిల్లలు పుట్టలేదనీ, సరోగసీ వైద్య చికిత్స కోసం వెళ్లిన ఓ మహిళను బెడ్‌పై పడుకోబెట్టిమరీ ఫెర్టిలిటీ డాక్టర్ రేప్ చేసిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
థానే నగరం పరిధిలోని ధారవీ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల వివాహితకు రెండేళ్ళ క్రితం వివాహమైంది. ఈమె తనకు పిల్లలు పుట్టడం లేదని ఫెర్టిలిటీ డాక్టరును కలిసేందుకు క్లినిక్‌కు వెళ్లింది. సరోగసీ చికిత్సా విధానంలో స్పెషలిస్టు అయిన డాక్టరును సంప్రదించింది. ఆ వివాహితను పరిశీలించిన వైద్యుడు.. గదిలోకి తీసుకువెళ్లి బట్టలన్నీ విప్పించి బెడ్‌పై పడుకోబెట్టాడు. 
 
ఆ తర్వాత ఆమె జననాంగానికి ఒక రకమైన జెల్ పూసి.. వివాహిత అరుస్తున్నా నోరు మూసేసి డాక్టరే అత్యాచారం చేశాడు. రేప్ చేసినట్లు ఎవరికైనా చెబితే తీవ్రపరిణామాలుంటాయని డాక్టరు హెచ్చరించాడు. వివాహిత ఇచ్చిన ఫిర్యాదుమేర ఫెర్టిలిటీ డాక్టరుపై కేసు నమోదు చేసి బాధిత వివాహితను వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు విచారణను మహిళా ఎస్ఐ ఆర్డీ షిండేకు అప్పగించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంగుళూరులో స్వేచ్ఛగా విహరిస్తున్న శశికళ... ఇదిగో వీడియో : డీఐజీ డి.రూప