Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుణ్ తేజ్ సినిమా ఎంతవరకు వచ్చింది?

Webdunia
శుక్రవారం, 13 మార్చి 2020 (20:44 IST)
వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌కు ప్రాధాన్యం ఇస్తూ హీరోగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్నారు మెగాప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్‌. గత ఏడాది `ఎఫ్ 2`, `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్` చిత్రాలతో సూప‌ర్‌డూప‌ర్ హిట్స్‌ను సొంతం చేసుకున్న మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌ హీరోగా కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు వెంక‌టేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. జూలై 30న సినిమాను విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.
 
 ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు కిర‌ణ్ కొర్రపాటి చిత్ర విశేషాలను తెలియచేస్తూ... “వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టిస్తోన్న చిత్ర‌మిది. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతుంది. ఈ సినిమా కోసం అమెరికాకు వెళ్లి ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ తీసుకుని వ‌రుణ్‌గారు చాలా మేకోవ‌ర్ అయ్యారు. ఫిబ్ర‌వ‌రి 24న సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేశాం. 
 
తొలి షెడ్యూల్‌ను వైజాగ్‌లో 15 రోజుల పాటు చిత్రీక‌రించాం. హీరోయిన్ స‌యీ మంజ్రేక‌ర్‌తో పాటు న‌వీన్ చంద్ర‌, న‌దియాల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ఏప్రిల్ 3న కొత్త షెడ్యూల్‌ను హైద‌రాబాద్‌లో స్టార్ట్ చేయ‌బోతున్నాం. ఈ లాంగ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌తో సినిమా షూటింగ్ పూర్త‌వుతుంది. జూలై 30న సినిమాను విడుద‌ల చేయాల‌నుకుంటున్నాం. మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ సంగీతం, జార్జ్ సి.విలియ‌న్స్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మార్తాండ్ కె.వెంక‌టేశ్‌గారు ఎడిటింగ్ వ‌ర్క్ చేస్తున్నారు’ అన్నారు.

సంబంధిత వార్తలు

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments