Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరుణ్ తేజ్‌తో పోటీకి సై అంటున్న నితిన్..!

Advertiesment
వరుణ్ తేజ్‌తో పోటీకి సై అంటున్న నితిన్..!
, గురువారం, 12 మార్చి 2020 (18:28 IST)
యువ హీరో నితిన్ ఇటీవల భీష్మ సినిమాతో సక్సస్ సాధించి మళ్లీ సక్సస్ ట్రాక్ లోకి వచ్చేసారు. నితిన్ ప్రస్తుతం తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నారు. ఇందులో నితిన్ - కీర్తి సురేష్ జంటగా నటిస్తున్నారు. రంగ్ దే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. 
 
ఈ మూవీకి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ వర్క్ చేస్తుండడం విశేషం. ఈ సినిమాతో పాటు నితిన్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చెక్ అనే సినిమా చేస్తున్నారు. ధ్రిల్లర్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాని భవ్య క్రియేషన్స్ బ్యానర్ పైన ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ, కథనం చాలా డిఫరెంట్‌గా ఉంటుందని.. ఆడియన్స్‌కి ఓ కొత్త అనుభూతి కలిగించేలా ఈ సినిమా ఉంటుందని తెలిసింది. 
 
ఆగష్టులో కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట అనే సినిమాని స్టార్ట్ చేయనున్నారు. ఇటీవల అంథాధూన్ రీమేక్ ప్రారంభించారు. ఈ మూవీకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఠాగూర్ మధు సమర్పణలో నితిన్ హోమ్ ప్రొడక్షన్ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌ పైన తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.
 
అయితే... వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతోన్న రంగ్ దే మూవీని జులై 30న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇదిలా ఉంటే... ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ చిత్రాలతో వరుసగా సక్సస్ సాధించిన వరుణ్ తేజ్ తాజాగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతోన్న సినిమాని ప్రారంభించారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వరుణ్ తేజ్ బాక్సర్‌గా నటిస్తున్నారు. ఈ పాత్ర చేయడం కోసం వరుణ్ తేజ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారని సమాచారం. ఇటీవల వైజాగ్‌లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసారు.
 
ఫిబ్రవరి నెల 24వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వైజాగ్‌లో మొదలైంది. రెండు వారాల పాటు ఏకధాటిగా జరిగిన ఈ షెడ్యూల్ ముగిసింది. వరుణ్ తేజ్ .. ముఖ్య పాత్రధారుల కాంబినేషన్లోని కొన్ని సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. త్వరలోనే మరో షెడ్యూల్‌ను ఆరంభించనున్నారు. 35 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ డిఫరెంట్ లుక్‌తో కనిపించనున్నారు. వరుణ్ తేజ్ నటిస్తున్న 10వ చిత్రమిది. 
 
ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు వెంకటేష్ నిర్మిస్తుండడం విశేషం. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందే ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు. ముకుందా, కంచె, లోఫర్, తొలిప్రేమ, ఫిదా, అంతరిక్షం, ఎఫ్ 2, గద్దలకొండ గణేష్.. ఇలా డిఫరెంట్ మూవీస్ చేస్తున్న వరుణ్‌ తేజ్ బాక్సర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసం ఈ సినిమాతో జులై 30న రానున్నారని వార్తలు వస్తున్నాయి. 
 
మరో వైపు నితిన్ రంగ్ దే కూడా జులై 30న వస్తుదని.. కావున జులై 30న వరుణ్ తేజ్, నితిన్ బాక్సాఫీస్ పోటీపడనున్నారని వార్తలు వస్తున్నాయి. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా పోటీపడితే... బాక్సాఫీస్ వద్ద ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాశీఖన్నా, స్టార్ హీరోకి అలా జరుగబోతోందంటూ జ్యోతిష్కుడు వివాస్పద వ్యాఖ్యలు