Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకినాడలో మట్కా కీలక షెడ్యూల్‌ షూటింగ్ లో వరుణ్ తేజ్

డీవీ
శుక్రవారం, 23 ఆగస్టు 2024 (17:27 IST)
Varun tej
వరుణ్ తేజ్ తన మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ 'మట్కా'తో పాన్ ఇండియాలో అడుగుపెడుతున్నారు. కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి మూవీని మ్యాసీవ్ స్కేల్ లో నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ ని డిఫరెంట్ లుక్స్ లో ప్రజెంట్ చేసిన ఫస్ట్‌లుక్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
 
ప్రస్తుతం ఈ సినిమా కాకినాడలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ ముఖ్యమైన షెడ్యూల్‌లో, టీమ్ టాకీ పార్ట్, ప్రముఖ తారాగణంతో కూడిన యాక్షన్ పార్ట్‌ను చిత్రీకరిస్తోంది. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో వరుణ్ తేజ్ చేతిలో తుపాకీతో కాకినాడ ఓడరేవులో క్రూయిజ్ షిప్ ముందు నిలబడి కనిపించారు.
 
పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో వరుణ్ తేజ్ డిఫరెంట్ మేకోవర్‌లలో కనిపించనున్నారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  
 
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఎ కిషోర్ కుమార్ డీవోపీ పని చేస్తుండగా, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్.  
 
తారాగణం: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికను ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం... ఎక్కడ?

ఎయిర్ డిఫెన్స్ ఆయుధ వ్యవస్థను పరీక్షించిన డీఆర్డీవో

రాజీపడని సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఎదిగిన నేత సురవరం : సీఎం రేవంత్ రెడ్డి

కమ్యూనిస్టు యోధుడు సురవరం ఇకలేరు... వైద్య కాలేజీకి మృతదేహం దానం

అదనపు కట్నం కోసం కోడలి జట్టు పట్టి లాగి కొడుతూ... నిప్పంటించిన అత్త... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments