Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరు డ్రగ్స్ కేసులో నటి హేమకు ఊరట!!

ఠాగూర్
శుక్రవారం, 23 ఆగస్టు 2024 (17:17 IST)
బెంగుళూరు డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటి హేమకు ఊరట లభించింది. ఈ కేసులో ఆమెను బెంగుళూరు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆమె బెయిల్‌పై ఉన్నారు. అయితే, ఆమెకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో డ్రగ్స్ తీసుకోలేదని నిర్ధారణ అయింది. ఈ మేరకు పోలీసుల క్లీన్ చిట్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోసినీ నటి హేమపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ విధించిన నిషేధాన్ని మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆదేశాలతో ఎత్తివేస్తూ నిర్ణయానికి కమిటీ ఆమోదముద్రవేసింది. 
 
ఇటీవల బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమను అక్కడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆమెను కోర్టులో హాజరుపరచగా, ఆమెకు కోర్టు రిమాండ్ విధించింది. ఇటీవలే ఆమె బెయిలుపై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో హేమంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సస్పెన్షన్ వేటు వేసింది. 
 
అయితే, తాను డ్రగ్స్ తీసుకోలేదని మీడియాలో వచ్చిన వార్తలను ఆధారంగా తీసుకుని తనను సస్పెండ్ చేయడం సరికాదని హేమ ఆవేదన వ్యక్తం చేసింది. దేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకున్నట్టు ఆమె రిపోర్టులు కూడా సమర్పించారు. హేమ ఆధారాలను పరిశీలించిన మా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమెపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments