Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పడ్డానండీ ప్రేమలో మరి'' అంటూ హీరోయిన్‌తో ప్రేమలో పడిన హీరో ఎవరు? 18న వివాహం

అమ్మాయిల హార్ట్ బీట్ హీరో వరుణ్ సందేశ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గత ఏడాది తన ప్రియురాలు హీరోయిన్ వితికా షేరుతో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ''హ్యాపీ డేస్'', ''కొత్త బంగారు లోకం'' సినిమాతో

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2016 (15:43 IST)
అమ్మాయిల హార్ట్ బీట్ హీరో వరుణ్ సందేశ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గత ఏడాది తన ప్రియురాలు హీరోయిన్ వితికా షేరుతో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ''హ్యాపీ డేస్'', ''కొత్త బంగారు లోకం'' సినిమాతో ఒక్కసారిగా స్టార్డమ్ సొంతం చేసుకున్న ఈ కుర్రాడు.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ ముందుకూ దూసుకుపోయాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు పరాజయం కావడంతో ఈ హీరోకి అవకాశాలు కరువయ్యాయి. 
 
ఇటీవలే ''పడ్డానండీ ప్రేమలో మరి'' అంటూ ఒక సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ హీరోయిన్ వితికతో నిజంగానే ప్రేమలో పడి.. పెద్దలను ఒప్పించి.. ఆమెను పెళ్లిచేసుకోవడానికి రెఢీ అయ్యాడు. హైదరాబాద్ నగర శివార్లలోని అలంకృత రిసార్ట్‌లో ఈ పెళ్ళి చాలా గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారట. ఆగస్టు 18వ తేదీ గురువారం రాత్రి 3.14 గంటలకు వీరి వివాహం అంగరంగ వైభవంగా జరుగబోతోంది. 
 
ప్రస్తుతం వరుణ్, వితిక వెడ్డింగ్స్ ఇన్విటేషన్స్ పంచే కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'హ్యాపీ డేస్' చిత్రం భారీ విజయం సాధించడంతో వరుణ్ సందేశ్ మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన 'కొత్త బంగారు లోకం' కూడా హిట్ కావడంతో వరుణ్‌కి అవకాశాలు వెల్లువెత్తాయి. పెళ్లి తర్వాత తనకు కెరీర్ పరంగా కలిస్తుందని వరుణ్ సందేశ్‌ భావిస్తున్నాడట. అదండీ సంగతి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments