Webdunia - Bharat's app for daily news and videos

Install App

సందీప్ కిషన్, విజయ్ సేతుపతి పాన్ ఇండియా మూవీ మైఖేల్‌లో వరుణ్ సందేశ్

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (16:02 IST)
Varun Sandesh
హీరో సందీప్ కిషన్ మైఖేల్‌ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో టైటిల్ రోల్ పోషిస్తుండగా, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మ‌రోసాని త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకునే పాత్ర‌ను పోషిస్తున్నారు.
 
స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా, సందీప్ కిషన్ సరసన దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తోంది. అదేవిధంగా ప్ర‌తిభ‌గ‌ల న‌టీమ‌ణుల్లో ఒకరైన వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావ‌డం విశేషం.
 
ఇప్పుడు, ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం వరుణ్ సందేశ్‌ను చిత్ర బృందం స్వాగతించింది. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ నుండి నిష్క్రమించిన తర్వాత వరుణ్ సందేశ్ అంగీక‌రించిన  మొదటి పెద్ద ప్రాజెక్ట్ ఇది.
 
మైఖేల్ చిత్రం షూటింగ్ తాజా షెడ్యూల్ ఈరోజు నుండి హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తుండగా, మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పితో కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తోంది.
 
మైఖేల్ చిత్రం భరత్ చౌదరి, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్త నిర్మాణంలో రూపొందుతోంది. నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు.
 
ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సిబ్బంది వివరాలు తర్వాత వెల్లడికానున్నాయి.
 
తారాగణం: సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్ తదితరులు
 
సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు: రంజిత్ జయకోడి
నిర్మాతలు: భరత్ చౌదరి మరియు పుస్కూర్ రామ్ మోహన్ రావు
సమర్పకుడు: నారాయణ్ దాస్ కె నారంగ్
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, కరణ్ సి ప్రొడక్షన్స్ LLP
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శివ చెర్రీ
PRO: వంశీ-శేఖర్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

నా పని నేను చేస్తున్నా.. పోలీసులు వాళ్ళ పని చేస్తున్నారు.. ఆర్జేవీ పరారీపై పవన్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments