Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్మ ఆరోపణలుపై లీగల్‌గా తేల్చుకుంటాం - న‌ట్టికుమార్‌

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (20:50 IST)
Natti kumar-check
రాంగోపాల్ వర్మ. త‌న పై చేసిన ఆరోప‌ణ‌ల‌ను న‌ట్టికుమార్ ఖండించారు. అంతేకాక ఆయ‌న గ‌తంలో ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయిన‌వి మీడియాకు విడుద‌ల చేశారు. ఆయ‌న విడుద‌ల చేసిన ప్ర‌ట‌క‌న సారాంశ‌మిది.
 
వ‌ర్మ‌, నువ్వు, అలాగే నీ తాత్కాలిక మరో స్నేహితుడు  రామసత్యనారాయణ ఆడుతున్న నాటకాలు ఎవరికి తెలియవు. ఎప్పటికప్పుడు కొత్తవాళ్లతో స్నేహం నటించి, వారి చేత నీ సినిమాలకు పెట్టుబడులు పెట్టించుకుని, ఆ తర్వాత మోసగించడం నీకు తెలిసినంతగా బహుశా సినీ పరిశ్రమలో ఇంకెవరికీ తెలియకపోవచ్చు. మోసపోయిన వాళ్లంతా బయటకు వచ్చి, నీ నిజ స్వరూపాన్ని ఇంతవరకు బయట పెట్టకపోవడం వల్లే, ఇంకెందరో నీ చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. నీ పాపాలు పండే సమయం ఆసన్నమయ్యింది. అందుకే నీకు ఈ విపరీత బుద్దులు పుట్టి, ఈ విధంగా వ్యహరిస్తున్నావు. మా ఇష్టం (డేంజరస్), హిందీ "ఖత్రా" చిత్రం విడుదలపై మేము స్టే తేవడంతో ఆగిపోయిన. విషయం తెలిసిందే. అది జరిగిపోయిన ఇన్ని రోజుల వరకు మెదలకుండా ఉండి.... ఇన్ని రోజుల  తర్వాత ఇలాంటి  ఓ నీచమైన పధకం రచించి, ఓ ప్రెస్ నోట్ తో బయటకు వచ్చిన నీ కుట్రలు ఎలాంటి వారికైనా ఇట్టే అర్ధమైపోతాయి. నీ సినిమాకు ఖర్చు లేకుండా సులువుగా పబ్లిసిటీ తెచ్చుకోవడం కోసం ఇలాంటి పథక రచన చేశావు. అయినా ఈ మేటర్ కోర్టు పరిధిలో ఉన్నది. నువ్వు చేసిన ఆరోపణలను ఖండించకపోతే డబ్బు విషయంలో నీ చేతిలో మోసపోయిన మమ్ములను కూడా నీ గురించి తెలియనివాళ్లు తప్పుగా అర్ధం చేసుకునే అవకాశం ఉంది. అందుకే  సూటిగా ఈ సమాధానం ఇస్తున్నాను. 
 
నీవు స్వయంగా ఇచ్చిన డాక్యూమెంట్స్ ను కూడా ఫోర్జరీ అంటున్నావంటే...నీది ఎలాంటి క్రిమినల్ మెంటాలిటీనో అర్ధం చేసుకోవచ్చు. నువ్వు ఇచ్చిన ఈ చెక్కులు, నీ బ్యాంకు అకౌంట్ లు కూడా ఫోర్జరీ నే అంటావా?. ఎట్టిపరిస్థితులలో నీ నిగ్గు తేలుస్తాం. మేము  కోర్టు కు వెళ్ళి, ఆధారాలు పెట్టి, మరీ స్టే తెచ్చాం. నువ్వు ఎలాంటి ప్రూప్స్ (proofs) లేకుండానే మాకు నువ్వు స్వయంగా ఇచ్చినవే ఫోర్జరీ డాక్యూమెంట్స్ అంటున్నావు ఆంటే నీ నిజ స్వరూపం, నీ నమ్మక ద్రోహం ఎలాంటిదో ఇట్టే చెప్పవచ్చు. ఎంతో మోసగాడివైనా, నిన్ను అంత సులువుగా వదలి పెడతామని అనుకోవద్దు. తోటి నిర్మాతలను, అలాగే ఎంతోమంది పరిశ్రమలోని వారిని  మోసం చేస్తున్న వర్మకు వంత పాడుతూ, ఈ పాపంలో పాలు పంచుకుంటున్న రామసత్యనారాయణ ఈ పాపాన్ని  మోస్తున్నందుకు నువ్వు అనుభవించక తప్పదు. లీగల్ గా కోర్టు ద్వారా ఈ విషయాలన్నింటిని తేల్చుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని న‌ట్టికుమార్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంగలూరు అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోలు హతం!

ఏపీలో ఇద్దరికే సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్లెవరంటే?: కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి

ఆదాయపన్ను విషయంలో కేంద్రం ఎందుకు దిగివచ్చింది?

ఏపీలో కొత్తగా మరో ఏడు విమానాశ్రయాలు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

కేరళ: వాడు ప్రియుడా లేకుంటే మానవ మృగమా.. ప్రియురాలి మృతి.. ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments