Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాన్ ఇండియా సినిమా అంటే అర్థం తెలీదు- నాని

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (20:38 IST)
Nani
పాన్ ఇండియా అంటే ఏమిటో నాకు తెలీయ‌ద‌ని నాని అన్నారు. అంటే సుంద‌రానికి టీజ‌ర్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న విలేక‌రులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. నేను న‌టుడిగా ప‌లు భిన్న‌మైన పాత్ర‌లు చేశాను .అందులో భాగ‌మే నేను చేసిన ఈ సుంద‌రం పాత్ర‌. సుంద‌ర‌ప్ర‌సాద్‌, లీలా థామ‌స్ క‌థ క‌నుక  టైటిల్‌పై ఇద్ద‌రు పేర్లు పెట్టాం. ఇందులో అంద‌రి పాత్ర‌లు ప్రాధాన్యమైన‌వే. ఇప్ప‌టి ట్రెండ్‌కు త‌గిన‌ట్లు కామెడీ ఇంపాక్ట్ చేస్తుంది. వివేక్ ఈ క‌థ చెప్ప‌గానే నాకు అప్ప‌టి జంథ్యాల‌గారు గుర్తుకు వ‌చ్చారు.

ఇందులో న‌వ్వించ‌డానికి రాసిన డైలాగ్‌లు వుండ‌వు. అంతా క‌థ‌లో భాగంగానే వుంటాయి. అందుకే క‌థ విన‌గానే న్యూ ఏజ్ ఫిలిం నా ద‌గ్గ‌ర‌కు రావ‌డం అదృష్టంగా ఫీల‌య్యాను. ఇక ఈ సినిమాను త‌మిళం, మ‌ల‌యాళంలో కూడా రిలీజ్ చేస్తున్నాం. కానీ కొన్ని భాష‌ల్లో యాజ్‌టీజ్‌గా రిలీజ్‌చేస్తే చూస్తారు. అందుకే క‌న్న‌డ‌లో డ‌బ్ చేయ‌కుండా తెలుగు వ‌ర్ష‌న్ విడుద‌ల చేస్తున్నాం. మ‌న సినిమాలు వారు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక పాన్ ఇండియా గురించి చెప్పాలంటే, మ‌న తెలుగు సినిమాను దేశ‌మంతా మెచ్చుకుంటే అదే పాన్ ఇండియా. అలాగే ప్ర‌పంచంలోని ఎక్క‌డివారైనా తెలుగు సినిమా బాగుంద‌ని వెతికి మ‌రీ ఓటీటీలోనే మ‌రోచోట చూడ‌డ‌మే పాన్ ఇండియా అనిపించుకుంటుంది అని జ‌వాబులిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mega DSC : ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ-జూన్‌లోపు నియామక ప్రక్రియ.. చంద్రబాబు

మండిపోతున్న వేసవి ఎండలు... ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు!!

Zero Poverty-P4: ఉగాది నాడు జీరో పావర్టీ-పి43 సహాయ హస్తం

ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్థాన్ ఖాళీచేయాల్సిందే : భారత్

Mamata Banerjee: లండన్ పార్కులో జాగింగ్ చేసిన మమత బెనర్జీ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments