నేచురల్ స్టార్ నాని తాజా సినిమా అంటే సుందరానికి నుంచి టీజర్ అవుట్ అయ్యింది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించగా మేకర్స్ మొత్తం మూడు భాషల్లో ఈ సినిమా జూన్ 10న రిలీజ్ కాబోతుంది.
కోలీవుడ్ హీరోయిన్ నజ్రియా ఫహద్ తెలుగులో పరిచయం అయ్యిన ఈ సినిమాపై మొదటి నుంచి కూడా మంచి బజ్ ఉంది.
తాజాగా విడుదలైన టీజర్ ఫుల్ ఫన్ రైడ్‌లో ఉందని చెప్పాలి. మొదటగా నాని చేసిన సుందరం రోల్ డెవలప్మెంట్ నుంచి లాస్ట్ వరకు మంచి ఫన్‌గా ఉంది. అలాగే హీరోయిన్ నజ్రియా కి నాని మధ్య ఉండే చిన్న లైన్ తో ఫ్యామిలీ ఎమోషన్స్ బాగున్నాయి.
అలాగే లాస్ట్‌లో నటుడు హర్ష వర్ధన్‌తో సుందరానికి ఉన్న ఏదో ప్రాబ్లమ్ కోసం చెబుతున్నట్టు చూపించిన సీన్స్ ఈ సినిమా టైటిల్ కి జస్టిస్ చేస్తూ చూపించిన విజువల్స్ మాత్రం మంచి హిలేరియస్‌గా ఉన్నాయి.
అలాగే నాని, నజ్రియా ల మధ్య కెమిస్ట్రీ, స్క్రీన్ పై వాళ్ళ జంట చూడ్డానికి చాలా బాగుంది. ఇంకా ఈ టీజర్ లో వివేక్ సాగర్ ఇచ్చిన స్కోర్ కూడా మరింత ప్లస్ అయ్యింది. అంటే సుందరానికి సినిమాలో నాని బ్రాహ్మణ యువకుని పాత్రలో నటించారు.
ఈ సినిమాలో హీరోయిన్ నజ్రియా క్రిష్టియన్ అమ్మాయి పాత్రలో నటించింది. మరి బ్రాహ్మణ యువకుడు, క్రిష్టియన్ అమ్మాయల ఇంటర్ రిలీజియన్ ప్రేమకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడ్డాయి. వాటిని సుందరం ఎలా సాల్వ్ చేసాడనే దానిపై ఈ సినిమాను తెరకెక్కించినట్టు కనబడుతోంది. ఈ టీజర్‌ను ఓ లుక్కేయండి.