#MeToo గురించి త‌మిళ న‌టి వ‌ర‌ల‌క్ష్మి ఏం చెప్పిందో తెలుసా..?

Webdunia
బుధవారం, 31 అక్టోబరు 2018 (14:29 IST)
వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్.. ఈ త‌మిళ న‌టి ఇటీవల వచ్చిన పందెం కోడి 2 చిత్రంలో ప్రతినాయిక పాత్రలో అద్భుతంగా నటించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఆమె మురగదాస్, విజయ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సర్కార్ చిత్రంలో ఓ ప్రముఖ పాత్రను పోషించారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో కళానిధి మారన్‌ నిర్మించారు. అశోక్‌ వల్లభనేని తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. నవంబర్ 6న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్‌కుమార్ తెలుగు మీడియాతో ముచ్చటించారు.
 
ఆమెను మీ టూ గురించి అడిగితే... నాకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి ఏడాది క్రితమే చెప్పాను. ఇప్పుడు మీ టూ రూపంలో చాలామంది చెబుతున్నారు. ఈ మీ టూ ఉద్యమం రెండేళ్ల క్రితం యు.ఎస్‌.లో ప్రారంభమైందని చెప్పారు. ఇప్పుడు ఇండియాలోకి వ‌చ్చింది. నేమ్‌ దెమ్‌ అండ్‌ షేమ్‌ దెమ్‌ అనేదే ఈ ఉద్యమం కాన్సెప్ట్‌. దీంతో తప్పు చేసిన వాళ్లకి ఎక్కడ మన పేరు వస్తుందో అనే భయం ఉంటుంద‌న్నారు. అయితే సౌత్‌ ఇండియాలో సైలెంట్‌గా ఉంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఉద్యమం చాలా అవసరం అని చెప్పారు.
 
ఎందుకంటే.. తదుపరి జనరేషన్‌ వచ్చేసరికి సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ అనే సమస్య తగ్గిపోతూ వస్తుంది. ఇలా అన్ని రంగాలకు సంబంధించినవారు ఇంకా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల సమస్యలు లేవు అని అంటున్న వారందరూ అబద్ధం చెబుతున్నట్లేనని స్ప‌ష్టం చేసారు. అందరూ స్పందిస్తేనే రాబోయే తరానికి ఓ పెద్ద సమస్యను దూరం చేసిన వాళ్లం అవుతాం అని తెలియ‌చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒక్క రాత్రికి రూ. 10 వేలు ఇస్తా, నాతో పడుకుంటావా?: కామాంధుడికి దేహశుద్ధి (video)

IIT Bombay: హాస్టల్ బాత్రూమ్‌లో కెమెరాలు ఫిక్స్ చేసి చిక్కిన ఓల్డ్ స్టూడెంట్.. చివరికి?

కోడలు గర్భిణి.. అయినా చంపేశాడు... గొడ్డలి, కత్తితో దాడి చేసి..?

Nara Lokesh: ఆస్ట్రేలియాకు నారా లోకేష్.. దీపావళి బహుమతిని అలా తెస్తారా?

Kavitha Son Political Debut: బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం రోడ్డుపైకి వచ్చిన కవిత కుమారుడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం