Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొడగొట్టిన నటుడు జీవీ.. రంగా అంటే ఏమిటో చూపిస్తాడట...

సినీ నటుడు జీవీ అలియాస్ జీవీ సుధాకర్ నాయుడు తొడగొట్టాడు. వంగవీటి రంగా అంటే ఏమిటో చూపిస్తానంటూ శపథం చేశాడు. సినీ నటుడిగా ఉన్న జీవీ ఉన్నట్టుండి ఇలా ఎందుకు చేశాడో తెలుసుకుందాం.

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2017 (12:10 IST)
సినీ నటుడు జీవీ అలియాస్ జీవీ సుధాకర్ నాయుడు తొడగొట్టాడు. వంగవీటి రంగా అంటే ఏమిటో చూపిస్తానంటూ శపథం చేశాడు. సినీ నటుడిగా ఉన్న జీవీ ఉన్నట్టుండి ఇలా ఎందుకు చేశాడో తెలుసుకుందాం. విజయవాడ రాజకీయాలను శాసించిన నేత వంగవీటి రంగా. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ఓ వెబ్ సిరీస్‌ను ఆయన నిర్మించనున్నారు. ఇందులో వంగవీటి రంగా పాత్రను జీవి పోషించనున్నారు.
 
ఈనేపథ్యంలో మంగళవారం వంగవీటి రంగా 29వ వర్థంతిని పురస్కరించుకుని విజయవాడలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జీవి సుధాకర్ నాయుడు తొడగొట్టాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొత్తం 150 ఎపిసోడ్లతో రంగా జీవిత చరిత్ర ఆధారంగా టీవీ సీరియల్ తీస్తున్నానని చెప్పారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన వంగవీటి చిత్రంలాకాకుండా, రంగా ఘనత చాటేలా, వాస్తవాలు ఉంటాయన్నారు. 
 
రంగా జీవిత చరిత్రను సినిమా తీయాలన్నది దాసరి కోరికని, ఆ కోరిక మేరకే ఈ సిరీస్‌ తీయనున్నట్టు తెలిపారు. రంగాపై సినిమా తీద్దామనుకుంటే 6 గంటల కథ వచ్చిందన్నారు. 'బాహుబలి'ని మించిన కథ రంగా జీవిత చరిత్ర అని కొనియాడారు. కుల రాజకీయాలు వద్దని చెప్పిన వ్యక్తి రంగా అని జీవీ గుర్తు చేశారు. కాగా, రంగా విగ్రహానికి పూలమాల వేసిన జీవీ నాయుడు ఆపై తొడగొట్టారు. దీంతో రంగా అభిమానులు కేరింతలు పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments