#KadapaTrailer : రాయలసీమలో రేప్‌లు - హత్యలు ఇలా చేస్తారా (వీడియో)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో వివాదానికి కేంద్ర బిందువు కానున్నారా? ఆయన తాజాగా కడప పేరుతో ఓ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను చూస్తే నిజమేనని చెప్పాల్సి ఉంటుంది.
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో వివాదానికి కేంద్ర బిందువు కానున్నారా? ఆయన తాజాగా కడప పేరుతో ఓ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను చూస్తే నిజమేనని చెప్పాల్సి ఉంటుంది. ఈ ట్రైలర్‌లో అత్యాచారాలు, హత్యలు వంటి భయానక దృశ్యాలను డైరెక్టుగా చూపించారు. అంతేనా, డైలాగులు కూడా బూతు పదాలనే వాడారు. ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయితే పెను వివాదమే సృష్టించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఓ ట్రైలర్‌ను వర్మ రిలీజ్ చేశారు.
కడప పేరుతో వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తానని ప్రకటించిన కొన్ని గంటల్లోనే రాంగోపాల్ వర్మ ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు. రాయలసీమ ఫ్యాక్షనిజానికి పుట్టినిల్లు అయితే.. అందులో కడప దానికి గర్భగుడి వంటిది అంటున్నాడు. తాను చూపించాలనుకుంటున్నది ఎలాంటి సెన్సార్ లేకుండా ట్రైలర్‌లోనే చెప్పేశాడు. అక్కడి ఫ్యాక్షనిజం చాలా దారుణంగా ఉంటుందని ఈ ట్రైలర్‌తో నిరూపించాడు. పలు సందర్భాల్లో రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పరిటాల రవి… ఫ్యాక్షనిజం గురించి చెప్పిన డెఫినేషన్లను ఉదహరిస్తూ… ట్రైలర్‌ను ఆర్జీవీ రూపొందించడం గమనార్హం. ఈ ట్రైలర్‌ను ఓసారి చూడండి.