Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరుతో సినిమానా? ఆ వార్తలన్నీ అవాస్తవం...

Webdunia
శుక్రవారం, 12 అక్టోబరు 2018 (11:07 IST)
మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150 సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వ‌డం. .ఈ సినిమా స‌క్స‌స్ అవ్వ‌డంతో సినిమాలు కంటిన్యూ చేస్తూ 151వ చిత్రంగా సైరా సినిమా చేస్తుండ‌డం తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత చిరు బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమాను డిసెంబ‌ర్ లో స్టార్ట్ చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే.. .ఒకప్పుడు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన వైజయంతీ మూవీస్ తాజాగా పూర్వ వైభవాన్ని అందుకుంటోంది. 
 
మహానటి సావిత్రి జీవితం ఆధారంగా మహానటి తీసి తన సత్తా చాటుకుంది. దేవదాస్‌తో మరో హిట్ కొట్టిన బ్యానర్‌లో మరో క్రేజీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. అదే సూపర్‌స్టార్ మహేష్‌ బాబు నటిస్తోన్న మహర్షి సినిమా. ప్ర‌స్తుతం వైజయంతీ మూవీస్ బ్యానర్ బిజీగా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవితో మరో క్రేజీ మూవీ తీయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై వైజయంతీ మూవీస్ బ్యానర్ వారు తమ ట్విట్టర్ ఖాతాలో క్లారిటీ ఇచ్చారు. 
 
ఇంత‌కీ ఏమ‌న్నారంటే.. వైజయంతీ మూవీస్ తమ తదుపరి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో వాస్త‌వం లేదు. మా సంస్థ ఇప్పటివరకూ చిరంజీవితో కలిసి 4 బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించింది. 5వ బ్లాక్ బస్టర్‌కు శ్రీకారం చుడితే అది వైజయంతీ మూవీస్‌కు చాలా సంతోషకరమైన విషయం. చిరంజీవి గారితో మూవీ చేయడానికి అంతా అనుకూలిస్తే గర్వంగా ఆ విషయాన్ని వెల్లడిస్తామని’ వైజయంతీ మూవీస్ సంస్థ ట్విట్టర్‌లో ద్వారా తెలియ‌చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నారా లోకేష్ చేపట్టిన కార్యక్రమాలు.. ఇంటర్ ఫలితాల్లో ఏపీ సూపర్ రిజల్ట్స్

విజయ సాయి రెడ్డి రాజీనామా -ఏపీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

పిఠాపురంలో అంతర్గత విభేదాలు.. పార్టీలో అనేక గ్రూపులు.. లోపించిన ఐక్యత

మే 1 నుంచి జూన్ 2 వరకు తెలంగాణ జిల్లాల్లో రేవంతన్న పర్యటన.. ఎందుకంటే?

పచ్చటి సంసారంలో చిచ్చుపెట్టిన ప్రేమ : భర్తను చంపేసిన లేడీ యూట్యూబర్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments