Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా సీనియర్ జర్నలిస్ట్ వడ్డి ఓంప్రకాశ్

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (13:12 IST)
Omprakash
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ వడ్డి ఓంప్రకాశ్ నారాయణ కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సి.బి.ఎఫ్.సి), హైదరాబాద్ అడ్వయిజరీ బోర్డ్ మెంబర్ గా  నియమితులయ్యారు. దీని కాలపరిమితి రెండు సంవత్సరాలు. 1989లో జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఓంప్రకాశ్ సూపర్ హిట్, వార్త, ఆంధ్రజ్యోతి, సాక్షి టీవీ, ఏబీయన్ ఛానెల్ లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా వివిధ హోదాలలో పనిచేశారు.

Om Cartoon
ఓం కథా రచయిత, మరియు కార్టూనిస్ట్ కూడా. గత రెండున్నర దశాబ్దాలుగా జాగృతి వార పత్రికలో చిత్ర సమీక్షలు రాస్తున్నారు. ప్రస్తుతం ఎన్ టీవీ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ లో అసోసియేటెడ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఫిల్మ్ జర్నలిస్ట్ గా ఉన్న అనుభవంతో ఈ నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని ఓంప్రకాశ్ చెప్పారు. తాను సి.బి.ఎఫ్.సి. అడ్వయిజరీ బోర్డ్ మెంబర్ కావడానికి కారకులైన సంస్కారభారతి దక్షిణ మధ్య క్షేత్ర మాజీ సహ ప్రముఖ్ శ్రీ కుమారస్వామికి ఓంప్రకాశ్ కృతజ్ఞతలు తెలియచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments