Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వారసుడు' విడుదల వాయిదా.. 11న కాదు.. 14న రిలీజ్ : దిల్ రాజు

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (11:51 IST)
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం "వారసుడు". తమిళంలో "వారిసు". ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ విడుదల తేదీని వాయిదా వేశారు. తమిళ వెర్షన్ అనుకున్నట్టుగానే జనవరి 11వ తేదీన విడుదల చేస్తామని, తెలుగు వెర్షన్ మాత్రం జనవరి 14వ తేదీన విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. 
 
ఇదే అంశంపై ఆయన సోమవారం ఓ కీలక ప్రకటన చేశారు. "వారసుడు" సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 11వ తేదీన కాకుండా 14వ తేదీన విడుదల చేస్తున్నట్టు తెలిపారు. తమిళ వెర్షన్ మాత్రం యథావిధిగా 11వ తేదీన విడుదల చేస్తామని తెలిపారు. చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలకు ఎక్కువ థియేటర్లు కావాలని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 
 
థియేటర్లకు పోటీ ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నానని, తానే ఒక అడుగు వెనక్కి వేశానని చెప్పారు. అందరూ తనపై ఏడి ఏడుస్తున్నారని, పండ్లున్న చెట్టుకే ఎక్కువ రాళ్లు దెబ్బలు పడతాయని వ్యాఖ్యానించారు. తనను ఎవరూ కార్నర్ చేయలేరని, ఆ పరిస్థితి అస్సలు తెచ్చుకోనని దిల్ రాజు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments